Technology: ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్న మెసెంజర్ యాప్ వాట్సాప్. ఓ విధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తున్నారు. అత్యంత వేగంగా ఇంటర్నల్ గా మన సర్కిల్ లో ఉన్న వ్యక్తులతో అన్ని రకాల సమాచారాలని చేరవేసుకోవడానికి ఈ వాట్సాప్ ఎంతో ఉపయోగపడుతుంది. మారుతున్న టెక్నాలజీని మరింత సులభతరం చేస్తూ యూజర్ ఫ్రెండ్లీగా యాప్ ని ఆ సంస్థ తీసుకొస్తుంది. దీనికోసం గ్రూప్ కమ్యూనికేషన్ కూడా డెవలప్ చేసింది.
అలాగే ఒకప్పుడు పీర్ టూ పీర్ వాట్సాప్ కాల్ మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్, ఆడియో కాల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా టెక్నాలజీ ఆధారంగా పని చేసే ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రామ్ హోమ్ కి అలవాటు పడ్డారు. ఇది వాట్సాప్ వినియోగదారులని మరింత పెంచింది. అయితే ప్రస్తుతం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ని యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వరకు వాట్సాప్ గ్రూప్ చాట్ లో తక్కువ మందికి మాత్రమే పరిమితి ఉండేది.
అయితే ఇప్పుడు కొత్త ఫీచర్ ద్వారా 512 మందిని గ్రూప్ లో యాడ్ చేయొచ్చని ఆ సంస్థ పేర్కొంది. అలాగే ఇక ఇది వరకు ఎంబీలలో ఉన్న ఫైల్స్ మాత్రమే వాట్సాప్ ద్వారాషేర్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సామర్ధ్యాన్ని 2జీబీకి పెంచింది. అలాగే డిలేట్ చేసిన మెసేజ్ లని మళ్ళీ స్టోరేజ్ చేసుకోవడానికి అండూ అనే ఆప్సన్ కూడా తీసుకొచ్చింది. ఎమోజీని చాట్ కి ట్యాగ్ చేయడానికి కొత్త అప్షన్స్ తీసుకొచ్చింది.
ఇలా సరికొత్త మార్పులతో వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చినట్లు మెటా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులు కూడా ఉండబోతున్నాయని ప్రకటించారు. మొత్తానికి వాట్సాప్ టెక్నాలజీలో మార్పులకి తగ్గట్లు యూజర్స్ వినియోగానికి మరింత సులభతరం చేసేందుకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి చాలా ఫాస్ట్ అప్డేట్స్ ని, ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ని తీసుకొస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.