Technology: టెక్నాలజీలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ప్రజలకు మరింత చేరువ కావడం కోసం కంపెనీలు కూడా కొత్త కొత్త అప్డేట్స్ సరికొత్త మార్పులతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. టెక్ కంపెనీలు నిర్వహించే యాప్ లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లని మరింతగా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో యూజర్ ఫ్రెండ్లీగా అప్డేట్ లు ఇస్తూ ముందుకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అంతర్జాల ప్రపంచంలో వివరించే వారికి గూగుల్ సెర్చ్ ఇంజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ కంపెనీకి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో ఉన్నాయి. అందులో గూగుల్ మ్యాప్స్ సర్వీస్ కూడా ఒకటి.
ఈ ఫీచర్ ని ప్రస్తుతం చాలామంది విరివిగా ఉపయోగిస్తున్నారు. సిటీలో మనకు తెలియని అడ్రస్ కూడా తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ను ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఫాలో అయిపోతున్నారు. గూగుల్ మ్యాప్ ఫీచర్స్ వల్ల చాలా మంది గమ్యస్థానాలు సులువుగా చేరుకోగలుగుతున్నారు. గూగుల్ మ్యాప్ ఫాలో అయితే ఏ రూట్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ రూట్ లో తక్కువగా ఉందని సంకేతాలు కూడా తెలుస్తాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ సర్వీస్ లో మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రయాణాలు, జిల్లా, రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రయాణం చేసినప్పుడు కచ్చితంగా టోల్ ఫ్రీ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.
ద్విచక్ర వాహనాలకు టోల్ ఫ్రీ అవసరం లేకుండా కార్లు, బస్సులు, లారీలకి ఖచ్చితంగా టోల్ ఫ్రీ చార్జీలు చెల్లించాల్సిందే. అయితే ఈ చార్జీలు ఎంత మొత్తంలో ఉన్నాయనే విషయం ఎవరికీ పూర్తిగా తెలియదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో రాబోతున్న ఫీచర్ తో టోల్ ఫ్రీ ఛార్జీలను కూడా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏ రూట్లో టోల్ చార్జీలు తక్కువగా ఉన్నాయి, ఏ రూట్లో ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలు ఈ మ్యాప్ లో కచ్చితంగా తెలుస్తాయి. దీంతో ప్రయాణ సమయంలో ఖర్చుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఈ ఫీచర్ ద్వారా పొందవచ్చు.
ఇప్పటికే అమెరికా, ఇండియా, ఇండోనేషియా దేశంలో సుమారు 2000 రూట్లలో ఈ ఫీచర్ ని ఇప్పటికే గూగుల్ ప్రారంభించడం జరిగింది. ఇండియాలో కర్ణాటకలో ఈ ఫీచర్ ని మొబైల్లో ఇప్పటికే గూగుల్ ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఇక ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే ప్రపంచ వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చి ఆలోచనలో ఉన్నట్లు గూగుల్ యాజమాన్యం తెలియజేసింది. మొత్తానికి టెక్నాలజీలో వస్తున్న ఈ సరికొత్త ఫీచర్ దూర ప్రయాణికులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.