Categories: Health

మెదడు ఆరోగ్యానికి ఈ ఐదు చిట్కాలు

వయసు పెరుగుతున్నా కొద్దీ మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు శారీరకంగా పౌష్టికంగ ఉన్న వ్యక్తి వయసు పైబడగానే అనారోగ్య సమస్యల బారిన పడనువచ్చు. జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటు అర్జీమర్స్‌తో పాటు మిగతా సమస్యలు వెంటాడే అవకాశం లేకపోలేదు. తగు జాగ్రత్తుల తీసుకుని ముందస్తుగా అప్రమత్తంగా ఉంటే అల్జీమర్స్ వంటి సమస్యలను దరిచేరనీయకుండా, జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. ఇప్పుడు కింద తెలిపే ఐదు చిట్కాలతో మీ జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు.

ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి:

ఉదయం లేవగానే పని బిజీలో పడిపోకుండా ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని తమ టైమ్‌ టేబుల్‌లో చేర్చుకోవాలి. మరిచిపోకుండా ప్రతి రోజు 30 నుంచి 60 నిమిషాలు శరీరానికి పని చెప్పాల్సిందే. మెదడు ఆరోగ్యానికి శరీరంతో పనేంటని అందరూ ఆలోచిస్తారు. మెదడు చురుగ్గా పని చేయాలంటే శరీరం చెమటోడ్చాల్సిందేనని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలా ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. శారీరకంగా చురుగ్గా ఉన్న వారు మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని శాస్త్రవేత్తలు నిర్వహించిన చాలా వరకు పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. వ్యాయామం చసే సమయంలో మెదడుకు రక్త ప్రసరణ పెరిగి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే అనేక మానసిక సమస్యలను తప్పించుకోవచ్చు. శరీరక వ్యాయామం అంటే జిమ్ములకే వెళ్లాల్సిన పని లేదు. ప్రతి రోజు మీ కాలనీల్లో అరగంట నడవటం, స్విమ్మింగ్‌కు వెళ్లడం, టెన్నిస్‌ను ఆడటం లేదా మీ హార్ట్ రేట్‌ను పెంచే మరే వ్యాయామమైనా చేయవచ్చు.

కంటి నిండా నిద్ర పోవాలి:

మెదడు ఆరోగ్యానికి నిద్ర అనేది ముఖ్య భూమికను పోషిస్తుంది. స్లీప్ థియరీ ప్రకారం కంటి నిండా నిద్ర పోవడం వల్ల బ్రెయిన్‌లో ఉన్న అసాధారణమైన ప్రోటీన్‌లను క్లియర్ చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. అంతే కాదు జ్ఞాపకశక్తి పెరగడంలోనూ సహాయపడుతుందంటున్నారు. ప్రతి రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు. రెండు గంటలు పడుకుని లేవడం మళ్లీ మూడు గంటలు పడుకోవడం అలా కాదు..సంపూర్ణంగా నిద్ర అవసరం అంటున్నారు. ఇలా వరుస నిద్ర మెదడులోని జ్ఞాపకాలను భద్రం చేయడానికి సమయాన్ని ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒకవేళ మీరు నిద్ర పోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

మెడిటరేనియన్ డైట్‌ను ఫాలో అవ్వాలి:

ఆరోగ్యకరమైన ఆహారము మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వైద్యులు మెడిటరేనియన్ డైట్‌ను సిఫారసు చేస్తున్నారు. ప్లాంట్ బేస్డ్ ఆహారం, తృణధాన్యాలు, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన ఫ్యాట్‌ను తీసుకోవాలంటున్నారు. ఎలాంటి డైట్ ఫాలో కాని వారితో పోల్చితే మెడిటరేనియన్ డైట్ ఫాలో అయ్యే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

మానసికంగా చురుకుగా ఉండాలి:

బ్రెయిన్ అనేది కండరాలతో సమానం దానిని ఎప్పుడూ ఉపయోగిస్తుండాలి లేదంటే దానిని కోల్పోవాల్సిందే. మెదడును చురుకుగా ఉంచుకునేందుకు చాలా సాధనాలు ఉన్నాయి. సుడోకో, క్రాస్‌వర్డ్ పజిల్స్, చెస్ ఆడటం, తరుచుగా చదవడం వంటి పనులు చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. మెదడును ఆక్టివ్‌గా ఉంచుకునేందుకు ఎలాంటి ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ అవసరం లేదు. ఇంట్లో నుంచే మన అభిరుచికి తగ్గట్లుగా పైన తెలిపిన వాటిని అనుసరిస్తే సరిపోతుంది. మొదడుకు ఏదో రకంగా పని చెప్పడం వల్ల కూడా దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా గంటల తరబడి టీవీ, ఫోన్‌లను చూడవద్దు ఇవి మీ మెదడు ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి.

సమాజంతో కలిసి నడవండి :

పక్కవారితో కాస్త సమయాన్ని గడపడం, వారితో మాట్లాడటం వల్ల డిప్రెషన్, ఒత్తిడిని జయించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వీలు దొరికినప్పుడల్లా స్నేహితులతో కుటుంబ సభ్యులను కలిసి వారితో కాస్త సమయాన్ని గడపండి. సామాజికంగా చురుకుగా ఉండటం వల్ల మీ మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Editor Sr

Recent Posts

Anasuya : నా బట్టలు నా ఇష్టం..అనసూయ షాకింగ్ కామెంట్స

Anasuya : బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజే వేరు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్…

10 hours ago

Kalki 2898AD : కల్కి టీంతో వర్క్ చేస్తారా?..మేకర్స్ బంపర్ ఆఫర్

Kalki 2898AD : సలార్ సాలిడ్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ…

15 hours ago

Aamani : నా భర్తతో అందుకే దూరంగా ఉన్నా

Aamani : అప్పటి సెన్సేషనల్ కామెడీ మూవీ జంబలకిడి పంబతో తెలుగు తెరకు పరిచయమైంది ఆమని. శుభలగ్నం,మిస్టర్ పెళ్లాం,శ్రీవారి ప్రియురాలు,మావి…

15 hours ago

Fruits: పడుకోవడానికి ముందు పొరపాటున కూడా ఈ పండ్లు తినకండి!

Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం పండ్లు తీసుకోవడం వల్ల…

16 hours ago

Lord Shiva: శివుడిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే?

Lord Shiva: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులలో ప్రతిరోజు ఒక్కో దేవుడిని పూజిస్తూ ఉంటాము. సోమవారం…

16 hours ago

Sai Pallavi : ‘రామాయణం’ సెట్ నుంచి సాయి పల్లవి ఫోటోలు లీక్

Sai Pallavi : రామాయణ ఇతిహాసం ఆధారంగా తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆదిపురుష్ మినహా అన్ని…

2 days ago

This website uses cookies.