Categories: LatestNews

e-rupi: ఇండియన్ మార్కెట్ లోకి ఈ-రూపీ… త్వరలో ఫైలెట్ ప్రాజెక్ట్

e-rupi: ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా చలామణిలో ఉంది. పేమెంట్స్ అన్ని కూడా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే ఎక్కువగా అవుతున్నాయి. కరోనా కాలంలో రెండేళ్లలో ఈ డిజిటల్ పేమెంట్ వ్యవస్ధ తారాస్థాయికి చేరింది. చిన్న టీ స్టాల్ నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు డిజిటల్ పేమెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి. మరో ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ డిజిటల్ పేమెంట్ విధానం వంద శాతం అమల్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేతిలో డబ్బులు పెట్టుకొని తిరిగేకంటే బ్యాంకులో ఉంటే స్మార్ట్ ఫోన్ సహాయంతో ఎప్పుడైనా, ఎలా అయినా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు అనే ఆలోచనలకి మెజారిటీ ప్రజలు వచ్చేసారు.

కేవలం గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే ప్రజలకి ఈ డిజిటల్ పేమెంట్ గురించి అంత అవగాహన లేదు. అలాగే క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచ వ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ. దీనికి ప్రత్యక్ష రూపం లేకపోయినా ఈ-కరెన్సీగా మార్కెట్ లో చలామణిలో ఉంది. ఇప్పుడు మార్కెట్ లో బ్లాక్ మనీ కూడా క్రిప్టో కరెన్సీ రూపంలోనే విదేశాలకి తరలి వెళ్తుందని మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఓ విధంగా రూపం లేని ఈ క్రిప్టో కరెన్సీ ప్రపంచ మార్కెట్ ని శాసిస్తుంది. అనేక కంపెనీలు వీటిలో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. అయితే ఎప్పుడు ఒకప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ పూర్తిగా కూలిపోవడం గ్యారెంటీ అనే మాటని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ-రూపీని మార్కెట్ లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఫైలట్ ప్రాజెక్ట్ త్వరలో మార్కెట్ లోకి తీసుకురాబోతుంది. ఇది డిజిటల్ కరెన్సీ రూపమే అయినా కూడా క్రిప్టో కరెన్సీ తరహాలోనిది కాదు. దీనికి మామూలు రూపాయి తరహాలోనే అన్ని రకాల ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి. దీనిని ఆర్బీఐ రెండు రకాలుగా అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇంటర్ బ్యాంకు, రిటైల్ మార్కెట్ లో కూడా వినియోగంలో ఉండే విధంగా తీసుకొస్తున్నారు.

ఇక ఈ-రూపీని ఆర్బీఐ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా వినియోగదారులకి పంపిణీ చేస్తాయి. ఫిజికల్ కరెన్సీ రూపంలోనే ఈ డిజిటల్ కరెన్సీ కూడా పని చేస్తుంది. కరెన్సీ వినియోగాన్ని మరింత సులభతరం చేయడానికి ఆర్బీఐ ఈ కొత్త ఈ-రూపీని తీసుకొస్తుంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అయ్యి భవిష్యత్తులో ఇండియాలో వినియోగంలో ఉంటుందనేది చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

12 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

14 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.