Technology: భారతదేశం సాఫ్ట్ వేర్ కంపెనీలకి ఇప్పుడు కేరాఫ్ గా మారిపోయింది. పదుల సంఖ్యలో ఎం.ఎన్.సి కంపెనీలు, వందల సంఖ్యలో స్టార్ట్ అప్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక సాఫ్ట్ వేర్ రంగంలో వచ్చిన భూమ్ తో ఒక్కసారిగా ఇంజనీరింగ్ చదువులు చదివేవారు ఎక్కువ అయిపోయారు. లక్షలాది మధ్య ప్రతి ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడుతున్నారు. అయితే కరోనా ముందు వరకు చాలా కంపెనీలు ఇంజనీరింగ్ కాలేజ్ లలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించి ఫ్రెషర్స్ ని కూడా ఉద్యోగాల కోసం ఎంపిక చేసుకునేవి. అలా ఎంపిక చేసుకున్న ఫ్రెషర్స్ కి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి తరువాత ప్రాజెక్ట్స్ లోకి తీసుకుంటాయి. ప్రాజెక్ట్ లోకి తీసుకున్న తర్వాత ఒక ఏడాది పాటు ప్రొహిబిషన్ లో వారిని ఉంచి అందులో టాలెంటెడ్ ఉన్నవారిని పర్మినెంట్ చేసుకుంటాయి.
10 సాఫ్ట్ వేర్ కంపెనీలకి గతంలో ప్రాజెక్ట్స్ విపరీతంగా వస్తూ ఉండేవి. ఈ కారణంగా అనుభవం లేకపోయిన ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకునేవి. దీంతో వేలాది మందికి జాబ్స్ వస్తూ ఉండేవి. అయితే కరోనా సమయంలో కంపెనీలకి ఆర్ధిక భారం పెరిగింది. ప్రాజెక్ట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాటు ఆటోమిషన్ టెక్నాలజీ, ఆర్ధిక మాంద్యం వెరసి కంపెనీలు తమ ఉద్యోగులని క్రమంగా తగ్గించుకునే పనిలో పడ్డాయి. పెద్ద కంపెనీలు అయినా విప్రో, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఇప్పటికే మూన్ లైట్ అంటూ ఓ వైపు ప్రాజెక్ట్స్ లేవని కారణం చూపుతూ ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతున్నాయి. అలాగే క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఎంపిక చేసుకున్న ఉద్యోగుల నుంచి తిరిగి ఆఫర్ లెటర్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏవో కారణాలు చూపించి వారికి మెయిల్స్ లో ఆఫర్ లెటర్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అలాగే అనుభవం లేదని కూడా రీజన్స్ చూపిస్తూ ఉద్యోగులని తొలగిస్తున్నారు. అలాగే ఆగష్టు నెలలో 10 శాతం రిక్రూట్మెంట్ కూడా కంపెనీలు తగ్గించినట్లు తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా కంపెనీ అవసరాలకి సరిపడా స్థాయిలో ఉద్యోగుల నియామకం ఉంటుందని కూడా టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రకరకాల కారణాలు చూపిస్తూ ఉద్యోగుల జీతాలతో కూడా కంపెనీలు కోతలు విధిస్తున్నాయి. భవిష్యత్తులో నైపుణ్యాలతో పాటు, సాఫ్ట్ స్కిల్స్, ఫాస్ట్ లెర్నింగ్, ఎప్పటికప్పుడు నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటూ వెళ్ళే వారికే సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు ఉంటాయనే మాటని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు సాఫ్ట్ వేర్ కంపెనీలలో పుట్టుకొస్తాయని కూడా చెబుతున్నారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.