Categories: EntertainmentLatest

Nayanathara : బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా

Nayanathara : తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయనతార లేడీ . తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాతో వెండితెరకు పరిచయమైంది నయన్. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కన్నడ బ్యూటీ అయినా తెలుగులోనూ పలు హిట్ సినిమాల్లో నటించి ఇక్కడ కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ నయనతారకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఒక్క పోస్ట్ షేర్ చేసినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

nayanathara-sensational-comments-about-annapoorani-movienayanathara-sensational-comments-about-annapoorani-movie
nayanathara-sensational-comments-about-annapoorani-movie

నయన్ ప్రేమాయణం విషయంలో కాస్త కాంట్రవర్సీలు ఎదుర్కొన్నప్పటికీ ఎట్టకేలకు తన ప్రియుడు ప్రముఖ తమిళ డైరెక్టర్ విజ్ఞేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య వీరి ఫోటోలను కూడా షేర్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది నయన్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ అమ్మడు. ఈ మధ్యనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన అట్లీ మూవీ జవాన్ లో హీరోయిన్ గా నటించి అందరిని అలరించింది. అంతే కాదు ఓటీటీ వేదికగా పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. అయితే నయన్ ఈ మధ్య చేసిన అన్నపూరణి సినిమా కంటెంట్ విషయంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎంతలా అంటే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ అన్న పూరణి సినిమాను తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచే తీసేంతలా. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని నిరసనలు ఎదురయ్యాయి. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి.

nayanathara-sensational-comments-about-annapoorani-movie

ఈ క్రమంలో తాజాగా అన్నపూరణి సినిమా వివాదంపై నయనతార స్పందించింది. సొసైటీలో అసమానతలను అధిగమించి విజయవంతం అయ్యే కథా పాత్రల్లో నటించడం నా బాధ్యత. నేను నా తోటి మహిళల గొంతుగా ప్రతిబింబించాలని అనుకుంటున్నాను. అందుకే సినిమాలను ఒక మాధ్యమంగా ఎంచుకుంటున్నాను”అని షాకింగ్ కామెంట్లు చేసింది నయన్.

nayanathara-sensational-comments-about-annapoorani-movie

వాస్తవానికి నయన్ ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్ . తన జీవితంలో ఎన్నో ఆటంకాలను, ఎదురుదెబ్బలను, ఇబ్బందుల్ని ఎదుర్కొంది. వాటిని అధిగమించి ఈ రోజు లేడీ సూపర్ స్టార్ స్థాయికి చేరుకుంది. 40కి దగ్గరవుతున్నా నయన్ ఇంకా హీరోయిన్‌గా హిట్లు కొడుతోందంటే ఆమె టాలెంట్ కు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం నయన్ మన్నాంగట్టి సిన్స్‌ 1960 అనే సినిమాను చేస్తోంది. అలాటే టెస్ట్‌ సినిమాలోనూ నటిస్తోంది. ‘జవాన్’ తరహాలోనే హిందీలో మరో మూవీకి సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘం

Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…

2 days ago

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

3 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

4 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

4 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

4 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

2 months ago