Tollywood: నయనతార, త్రిష అంటే నిర్మాతలు భయపడుతున్నారు..? ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే టాక్ వినిపిస్తోంది. సౌత్ లో ఇప్పుడు బాగా ఫాంలో ఉన్న హీరోయిన్ త్రిష కృష్ణన్, నయనతార. వీరు సీనియర్ హీరోలకి పర్ఫెక్ట్‌గా సూటయ్యే హీరోయిన్స్. అంతేకాదు, ఫాంలో ఉన్నవాళ్ళు కాబట్టి వీరి వల్ల సినిమా బిజినెస్ కూడా బాగా జరుగుతోంది.
నయనతార, త్రిష హీరోయిన్స్ అంటే ఓటీటీ నుంచి శాటిలైట్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి నిర్మాతలకి. దాంతో వీరి రెమ్యునరేషన్ గట్టిగా పెంచేశారు. ఇప్పుడు నయనతార సినిమా ఒప్పుకుంటే 12 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని ఇటీవల ఒక వార్త వచ్చి బాగా వైరల్ అయింది. ఈ బ్యూటీ ఇంతగా డిమాండ్ చేయడానికి కారణం బాలీవుడ్ మూవీ జపాన్.
బాలీవుడ్ లో బాధ్షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ జపాన్ చిత్రాన్ని రూపొందించాడు. దాదాపు 1000 కోట్లు రాబట్టింది. దాంతో నయనతార రెమ్యునరేషన్ బాగా డిమాండ్ చేస్తుంది. ఇక 96 సినిమాతో ఫాంలోకి వచ్చిన త్రిష అన్నీ పాన్ ఇండియా సినిమాలనే ఒప్పుకుంటుంది. అదీ కాక ఇప్పుడు త్రిష అందం చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. నాలుగు పదుల వయసులో కూడా ఇంత గ్లామర్ ఎలా మేయిన్‌టైన్ చేస్తుందో జనాలకి అర్థం కావడం లేదు.
ఇటీవల కోలీవుడ్‌లో విజయ సరసన నటించి హిట్ అందుకుంది. దాంతో మన టాలీవుడ్ మేకర్స్ నయనతార కాకుండా త్రిష ని సినిమాలో ఫిక్స్ చేసుకుందామనుకుంటే ఆమె కూడా 10 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. పాన్ ఇండియన్ సినిమా అంటే వీరిద్దరు 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని మన తెలుగు నిర్మాతలు ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఒక్క హీరోయిన్ కే ఇవ్వలేక భయపడుతున్నారట. అందుకే, చాలావరకు రష్మిక మందన్న, శ్రీలీల లాంటి వారితో సరిపెట్టుకుంటున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.