Naresh-Pavitra Lokesh : ఇటీవల కాలంలో మన తెలుగుతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచిన జంట నరేష్-పవిత్ర లోకేష్. ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెగ ప్రచారం జరిగింది. అయితే అది ఉత్తుత్తి పెళ్లి మాత్రమే అని తర్వాత వార్తలు వచ్చాయి. నిజంగా నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నట్టుగా ఓ వీడియో వచ్చి సోషల్ మీడియాలో హల్ హల్ చేసింది. దీని గురించి నరేష్ తర్వాత చెప్తానంటూ దాటేశారు.
అయితే వీరిద్దరూ కలిసి ప్రముఖ సీనియర్ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వంలో ‘సెకండ్ ఇనింగ్స్’ అనే సినిమాలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో వీరు పెళ్లి చేసుకునే సన్నివేశాన్నే ఇటీవల నరేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారట. ఈ సినిమా కథ దాదాపు నరేష్-పవిత్ర లోకేష్ కెరీర్‌కి దగ్గరగా ఉంటుందని సమాచారం. సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన ఎం ఎస్ రాజు ఆ తర్వాత దర్శకుడిగా మారి ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు.
Naresh-Pavitra Lokesh : నిజంగానే నరేష్ పవిత్రను పెళ్లి చేసుకుంటాడా..?
అయినా కూడా ఆయన సినిమా మీద ప్రేమ అభిమానంతో ఏదో ఒక సినిమా చేస్తూ వస్తున్నారు. అలా చేస్తున్న సినిమానే ‘సెకండ్ ఇన్నింగ్స్’. నరేష్-పవిత్ర లోకేష్ కొత్త జీవితం మొదలుపెట్టాలని ఆరాటపడుతున్నారు. దీనికి కొందరు మద్ధతు తెలుపుతుంటే, కొందరు మాత్రం నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ ‘సెకండ్ ఇన్నింగ్స్’లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే నరేష్ పవిత్రను పెళ్లి చేసుకుంటాడా..? అనేది మాత్రం ఇప్పటివరకు సస్పెన్స్‌గానే ఉంది. ఇక సినిమాల పరంగా ఇద్దరూ బిజీగా ఉన్నారు. నరేష్ అద్భుతమైన పాత్రల్లో అదరగొడుతుంటే పవిత్ర చక్కటి అమ్మ, అత్త పాత్రల్లో ఆకట్టుకుంటోంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.