Naresh-Pavitra : సోషల్ మీడియాలో ఈ మధ్య నరేష్ పవిత్రుల పేరు బాగా వినిపిస్తోంది. వీరి రిలేషన్ తో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది ఈ జంట. ఓల్డ్ ఏజ్ లోనూ టీనేజ్ లాగా తమ ప్రేమలో విహరిస్తూ ఈ కపుల్స్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉన్నారు. వీరి రిలేషన్ ని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా మొదటగా లిప్ టూ లిప్ ముద్దు పెట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేసి అందరిని షాక్ కి గురి చేశారు. ఈ ఫోటో చూసి ఒక్కసారిగా ఇండస్ట్రీ అవ్వక్కయింది. లేటు వయసులో ఇదేం గోలరాబాబు అంటూ తలలు పట్టేసుకున్నారు నేటిజన్లు. ఏది ఏమైనా తమ రొమాన్స్ ను మాత్రం వినడం లేదు ఈ కపుల్స్.
నరేష్,పవిత్రులు ప్రస్తుతం మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ట్రైలర్లు విడుదలయ్యాయి ఇవన్నీ కూడా నరేష్ జీవితానికి దగ్గరగా ఉండడం నరేష్ జీవితాన్ని ఆ సినిమాలలో చూపిస్తుండడం కోసం మెరుపు. వరుసగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు నరేష్, పవిత్ర. బుల్లితెరలో సక్సెస్ ఫుల్ గా నడిచే షోలలోనూ పాల్గొంటూ వారి సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ఇదివరకు ఎన్నడు ఏ సెలబ్రిటీ చేయని విధంగా బుల్లితెర పైన తమ ముద్దులాటతో మరోసారి మైండ్ బ్లాక్ చేశారు.
నరేష్ చాలా బోల్డ్ గా ఉంటారు. తన ఆలోచనలను,అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయన ప్రవర్తనను చూస్తే ఇదే అనిపిస్తుంది. దానికి పవిత్ర లోకేష్ తో సహజీవనమే కారణం అని చెప్పవచ్చు. వీరిద్దరూ నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కానీ గత ఏడాది నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నరేష్ మూడో భార్య,పవిత్ర లోకేష్ తో నరేష్ రిలేషన్ ను బయట పెట్టడంతో ఒక్కసారిగా ఈ వార్త గుప్పుమంది. ఎవరు ఏమన్నా ఎంత రాద్ధాంతం చేసిన నరేష్ పవిత్ర వెనకాలే ఉన్నాడు ఆమెను పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్ళాం కన్నా ఎక్కువగానే చూసుకుంటున్నాడు. అడుగడుగునా ఆవిడను ఆరాధిస్తున్నాడు.
మళ్లీ పెళ్లి సినిమా మే 26న విడుదల కాబోతోంది. తెలుగు,కన్నడ భాషల్లో దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు భాషల్లో హిట్ టాక్ వస్తే మిగతా భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ట్రెండింగ్ కపుల్ సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోకి వెళ్లారు . ఈ వేదికపై ఈ ఓల్డ్ కపుల్ తమదైన రొమాన్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. మీరు పవిత్రను ఏమని పిలుస్తారని ఓంకార్ అడగ్గానే నరేష్ అమ్ములు అని పిలుస్తాను అని సిగ్గుపడుతూ చెప్పేశాడు. ఇంకా ముద్దొస్తే అమ్ము అంటా ఇంకా ముద్దొస్తే… వద్దులే చెప్పకూడదు అని తనదైన స్టైల్ లో రొమాన్స్ చేశారు.
ఆకాశం నేల మీద పడ్డా, భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటామని నరేష్ చెప్పారు. ఇద్దరు ఒకరినొకరు ముద్దుల్లో ముంచేసుకున్నారు. అనంతరం తన తండ్రి తల్లి కృష్ణ, విజయ నిర్మల గురించి నరేష్ మాట్లాడారు. వారిద్దరి బంధాన్ని గురించి తెలియజేశారు. వారిద్దరూ 24 గంటలు కలిసే ఉండేవాళ్ళని చెప్పారు నరేష్ . అమ్మ మరణించిన తర్వాత ఆయన పక్కన చైర్ ఖాళీగా కనిపించేది. ఆయనలో అమ్మను చూసుకున్నాను. తర్వాత ఆయన కూడా మా నుంచి వెళ్లిపోయారు . ఆ రెండు కుర్చీలు ఖాళీగా కనిపిస్తుంటే చూసి తట్టుకోలేకపోయేవాడిని భావొద్వేగమయ్యారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.