Naresh-Mahesh : టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేర్లు నరేష్, పవిత్ర. వీరిద్దరి రిలేషన్ గురించి రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. ప్రస్తుతం ఈ లవ్ బర్డ్స్ మళ్లీ పెళ్లి అనే సినిమాతో వెండితెరపైన సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ జోడీ సినిమా ప్రమోషన్ లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నరేష్ తమపై వస్తున్న రూమర్స్ కు పుల్ స్టాప్ పెడుతూ మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని ప్రకటించారు. తన మూడో భార్య నుంచి తనకు విడాకులు వచ్చిన వెంటనే మేమిద్దరం వివాహ బంధంతో ఒక్కటవుతామని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పటి వరకు నరేష్, పవిత్ర, రమ్మ పేర్లు మాత్రమే నరేష్ పర్సనల్ విషయంలో బయటకు వచ్చాయి. తాజాగా నరేష్ తమ్ముడు మహేష్ బాబు పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అందుకు కారణం నరేషే. తన వ్యక్తిగత విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా ఇన్వాల్వ్ చేశాడు.
నరేష్, మహేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా. వీరిద్దరికి మంచి బాండింగ్ ఉంది. తల్లులు వేరైనా వీరిద్దరూ మంచి రిలేషన్ నే కంటిన్యూ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. సూపర్ స్టార్ కృష్ణ పెంపకంలో పెరిగారు. ప్రస్తుతం నరేష్ కు 60 ఏళ్లు. అయినా సరే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో కృష్ణ గారి పరువు తీశాడంటూ సోషల్ మీడియా నరేష్ పై అనేక విమర్శలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు నరేష్ విషయంలో కృష్ణగారి మొదల భార్య పిల్లల పేర్లు ఎక్కడా వినిపించలేదు. వీరి విషయంపై ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి నరేష్ కు సపోర్టు ఉందా ? లేదా అన్న డౌట్స్ అందరిలోనూ కామన్ గానే ఉన్నాయి. ఇదే సమయంలో నరేష్ ఈ టాక్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. పతిత్రతో తన బంధానికి మహేష్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్వయాన నరేషే తెలిపాడు. తమ రిలేషన్ గురించి కృష్ణ గారితో పాటు మహేష్ కు ఎప్పుడో తెలుసునని చెప్పుకొచ్చారు. వారిద్దరూ ఓ కే చెప్పారని.మేమంతా ఒకే కుటుంబం అని చెప్పుకొచ్చారు నరేష్.
అక్కడితో అయిపోలేదు. కృష్ణగారికి పవిత్ర చేసే వంటలు అంటే చాలా ఇష్టమని తెలిపారు నరేష్. ఆమె చేసిని ప్రతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారట. తమకోసం పవిత్ర ఎన్నో రుచికరమైన వంటకాలను వండేదట. పవిత్రకు తెలుగు రాదని అందుకే తన తండ్రి కృష్ణతో ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడేదని అన్నారు. ఇలా పవిత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుని ఆమెను ఆకాశానికి ఎత్తేశారు నరేష్. మా బంధం అందరికీ అంగీకారమని అందుకే మేము ఒకటయ్యేందుకు నిర్ణయించుకున్నామని మరోసారి తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు నరేష్.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.