Nani : నాని సిల్క్ స్మిత ఫ్యాన్ కాదు..అయినా దసరా పోస్టర్‌లో ఎందుకు పెట్టారో తాజాగా నేచురల్ స్టార్ వెల్లడించారు. ఆయన హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దసరా. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మర్చి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
దీనిలో భాగంగా వేలంటైన్స్ డే సందర్భంగా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరో నాని సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. బ్రేక్ అప్ సాంగ్ అందరికి నెమ్మదిగా ఎక్కేస్తుంది.. అని నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటి వరకు తనకు బాగా నచ్చిన సాంగ్స్‌లో ఇది కూడా చేరుతుందని చెప్పుకొచ్చారు. లవ్ బ్రేక్ అప్ అయిన ప్రతి ఒక్కరు ఈ పాటకి బాగా కనెక్ట్ అవుతారని అన్నారు.
Nani : శ్రీకాంత్ ఓదెల సిల్క్ స్మిత కి పెద్ద ఫ్యాన్…
అంతేకాదు, బ్రేక్ అప్ సాంగ్స్ లో ఇది ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్ గా నిలుస్తుందని, నాని వెల్లడించారు. ఇక దసరా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని వెనుక అలనాటి తార సిల్క్ స్మిత పెయింట్ కనిపిస్తోంది. ఇందులో సిల్క్ రొమాంటిక్ లుక్ లో కనిపిస్తూ దసరా చిత్రం మీద బాగా అంచనాలను పెంచేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ లుక్ పై నాని చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సిల్క్ స్మిత కి పెద్ద ఫ్యాన్ అట.
అందరూ ఆమెను చూస్తే కోణంలో కాకుండా ఓ ఆరాధ్య దేవతలా అభిమానిస్తాడని నాని తెలిపారు. అందుకే, సిల్క్ స్మితని ఈ పోస్టర్ లో పెట్టడం జరిగిందని వెల్లడించారు. కానీ, నేను మాత్రం సిల్క్ స్మిత ఫ్యాన్ కాదనడం ఇక్కడ ఊహించని ట్విస్ట్. శ్రీకాంత్ ఇష్టప్రకారమే ఈ పోస్టర్ ని డిజైన్ చేసినట్టు చెప్పుకొచ్చారు నాని. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్న నానీ కొత్త చిత్రం దసరా తో అయినా భారీ హిట్ కొడతాడేమో చూడాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.