Nandita Swetha: బోల్డ్ సీన్స్ ఉన్న కథలతో రండి సైన్ చేస్తా..అంటుందట గ్లామర్ బ్యూటీ నందిత శ్వేత. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. అయినా మేకర్స్ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు ఇవ్వలేదు.
వచ్చిన అవకాశాలేవీ నందితని స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టలేకపోయాయి. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఎక్స్ 100 సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన మూడవ సినిమాగా మంగళవారం తెరకెక్కించారు. మధ్యలో వచ్చిన మహా సముద్రం ఊహించని షాకిచ్చింది. అయినా మళ్ళీ పాయల్ రాజ్‌పుత్ ని నమ్ముకొని మంగళవారం చేశారు.
త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పాయల్ ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఎంతగా రొమాంటిక్ సీన్స్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పాయల్ కి కూడా హిట్ దక్కలేదు. అజయ్ పరిస్థితి అంతే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో మంగళవారం వస్తోంది. ఈ సినిమాలో కూడా కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయట. అవి పాయల్ మాత్రమే చేస్తుందని ప్రమోషన్స్‌లో అజయ్ భూపతి చెపుకొచ్చారు.
ఇప్పుడు అలాంటి సీన్స్ చేయడానికి నేనూ రెడీ అంటోంది నందిత శ్వేత. ఈమె కూడా మంగళవారం సినిమాలో నటించింది. వాస్తవానికి అజయ్ భూపతి ఆర్ ఎక్స్ 100 సినిమాలో పాయల్ కంటే ముందు నందిత నే అడిగారట. కానీ, ఆమె అలాంటి సీన్స్ చేయలేనని నో చెప్పిందట. ఇది నందిత వర్షన్. కానీ, అజయ్ చెప్పింది..నేను కొత్త దర్శకుడిని కాబట్టి బెడ్రూం సీన్స్ సరిగ్గా తీయగలనో లేదో అని రిజెక్ట్ చేసిందీ అని. ఏదేమైనా అజయ్ మళ్ళీ నందితకి మంగళవారం సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆమె కూడా ఇప్పటి నుంచి బోల్డ్ సీన్స్ ఉంటే కథ ఒప్పుకుంటా..అని ఓపెన్ అవడం. మరి ఆ దర్శకులెవరో నందిత శ్వేతతో సినిమా ఎప్పుడు చేస్తారో చూడాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.