Namitha-Veerendra : సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉంది. ఆల్మోస్ట్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలతో జోడి కట్టి ఇండస్ట్రీలో ఉన్నంతకాలం సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగించింది. ఆ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. అయితే పెళ్లయినప్పటి నుంచి నమితకు కష్టాలు వచ్చాయనే చెప్పాలి. నమిత భర్త వీరేంద్ర చౌదరి ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. అతనికోసం తమిళనాడు పోలీసులు గల్లీ గల్లీ గలీస్తున్నారు . ఓ ఫ్రాడ్ కేసులో నమిత భర్తకు పోలీసులు నోటీసులు పంపారు. అయితే ప్రస్తుతం అతని ఆచూకీ తెలియడం లేదు. అరెస్ట్ చేస్తారనే భయంతో వీరేంద్ర పారిపోయి ఉంటాడని అంతా భావిస్తున్నారు.
మీడియా కథనాలా ప్రకారం.. సేలం జిల్లాలో ఉంటున్న గోపాలస్వామి తనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన సూక్ష్మ, చిన్న- మధ్యతరహా పరిశ్రమల సంస్థలోని తమిళనాడు డివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇప్పించాలని రూ. 50 లక్షల లంచం ఇచ్చాడు. అదే విభాగానికి గతంలో విధులు నిర్వహించిన మాజీ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్‌లకు ఈ సొమ్ము అప్పగించాడు. అయితే ఈ పోస్టులో రీసెంట్ గా వీరేంద్ర చౌదరి అనే అతను అపాయింట్ అయ్యాడు. దీంతో బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగిందో తెలియజేయాలనీ గోపాలస్వామి సేలం పోలీసులను అశ్రయించాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈమధ్యనే వారిద్దరీని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం రాబట్టడానికి వీరంద్ర చౌదరికి కూడా నోటీసులు పంపారు.
అయితే వీరంద్ర చౌదరి విచారణకు రాలేదు. దీంతో పోలీసులు మళ్లీ నోటీసులు పంపారు. అయినా స్పందన లేకపోవడంతో అసలు విషయం ఏంటో తెలుసుకున్నారు. వీరేంద్ర ఇంట్లో లేకపోవడంతో అరెస్టు భయంతో పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలిగిన తార నమిత. నమిత మీద ఉన్న అభిమానంతో ఆమె అభిమానులు తమిళనాడులో ఆమె పేరిట గుడి కూడా కట్టారు. సినిమాలకు బై బై చెప్పేసిన నమిత 2017లో వీరేంద్రను పెళ్లి చేసుకుంది. ఆమెకు కవల పిల్లలు ఉన్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.