Nagababu : ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు ముగిసాయి. సోమవారం పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. గతంతో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం కూడా ఆశాజనకంగానే ఉంది. మరికొద్ది రోజుల్లో రాజకీయ నాయకుల భవితవ్యం తేలనుంది. అయితే ఎన్నికలు ముగిసినా ఇంకా ఆ వేడి తగ్గలేదు. ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య కొచ్చి చిక్కులను తెచ్చిపెట్టాయి. ఒకరకంగా రాజకీయ గోడలు కట్టేశాయి అని చెప్పుకోవచ్చు.పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం భగ్గుమంది.
ఈ ఎన్నికల్లో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ప్రచారంలో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కు సపోర్ట్ గా నిలిచింది. నాగబాబు,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు పిఠాపురం పోయి మరీ పవన్ ప్రచారంలో పల్గొన్నారు. ఇక అన్నయ్య చిరంజీవి ఓ వీడియో మెసేజ్ తో పవన్ కు మద్దతిచ్చారు. ఎలక్షన్ కి ముందు రోజు రామ్ చరణ్ పిఠాపురంలో ల్యాండ్ అయ్యి బాబాయ్ కి మద్దతుగా ప్రచారం చేశాడు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున మాత్రం ట్వీట్ ద్వారా పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపి సలైంట్ అయ్యాడు. కానీ బన్నీ ఫ్రెండ్ వైసీపీ క్యాండిటేట్ కోసం స్వయంగా నంద్యాల వెళ్లి మరీ అతడిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చాడు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడనే ప్రచారం ఏపీలో జరిగింది. దీంతో జనసైనికులకు అల్లు అర్జున్ మీద ఓ రేంజ్ లో కోపం వచ్చింది.అంతే కాదు ఓటు వేసే సమయంలోనూ తన చర్యను బన్నీ సమర్థించుకున్నాడు.
ఇవన్నీ గమనించిన నాగబాబు డీప్ గా హర్ట్ అయ్యారు. అందుకే రాత్రి బన్నీకి ఇండైరెక్టుగా ఇచ్చిపడేశాడు. ట్విటర్ లో ట్వీట్ పెట్టి మరోసారి బన్నీ ఫ్యన్స్ ను రెచ్చగొట్టారు. ఈ ట్వీట్ తో పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం మొదలైంది. తమది పవనిజం అంటూ పవన్ ఫ్యాన్స్, తమది అల్లు ఆర్మీ అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు. ట్వీట్ లో నాగబాబు బన్నీ పేరెత్తకుండానే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. “మాతో ఉంటూ మా ప్రత్యర్థులను సపోర్ట్ చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ ఇన్ డైరక్ట్‌గా మెసేజ్ ఇచ్చారు నాగబాబు. నాగబాబు ట్వీట్ తో పవన్ కు కొతత్త తలనొప్పులు మొదలయ్యాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.