Nabha Natesh : టాలీవుడ్ నటి నభా నటేష్ సినిమాలతో కన్నా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది. చేసింది రెండు మూడు సినిమాలే కానీ, అందాల ఆరబోతతలో నెట్టింట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. నన్నుదోచుకుందువటే అనే మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలే చేసినా పెద్దగా అవి హిట్ కాలేదు. కానీ ఆ తర్వాత టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ మూవీలో నటించి క్రేజ్ సంపాదించుకుంది. రామ్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీలో తన గ్లామర్ తో , హీరోతో పండించిన కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకుంది నభా. ఒక రకంగా తన అందాలతో కుర్రకారు హృదయాలను దోచేసింది. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడు రేంజ్ మారిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈ భామ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
నభా నటేష్ కు అందం, టాలెంట్ రెండూ ఉన్నా ఎందుకో కలిసిరాలేదు. అంతే కాదు ఆ మధ్య ఓ చిన్న యాక్సిడెంట్ కూడా అయ్యింది. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నభా. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే అమ్మడి అందాల ఆరబోత హద్దు దాటుతుంటుంది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది మళ్లీ బిజీగా మారనుంది. ఇప్పుడు నభా, హీరో నిఖిల్ తో ఓ మూవీ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ పంచాయితీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిన్నదానికి టాలీవుడ్ హీరోకు మధ్య ట్విట్టర్ వార్ జరిగింది.
లేటెస్టుగా నభా డార్లింగ్ అంటూ ఓ వీడియోను ట్విటర్ లో షేర్ చేసింది. దీనికి వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్ డార్లింగ్ అంటూ నటుడు ప్రియదర్శి రిప్లై ఇచ్చాడు. ఈ కామెంట్ చూసిన నభనటేష్ రెచ్చిపోయింది. మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్ అని ఓ వీడియో క్లిప్ ను షేర్ చేసింది. అప్పట్లో డార్లింగ్ అంటే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని కలకత్తా కోర్టు తీర్పు ఇచ్చిందన్న విషయాన్నీ కూడా ఈ అమ్మడు గుర్తు చేసింది. దాంతో ప్రియదర్శి ఏమాత్రం తగ్గకుండా,మీరేమో డార్లింగ్ అని అనొచ్చు..మేము అంటే కేసులు పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్ అని మరోసారి కౌంటర్ ఇచ్చాడు. దానికి లైన్ క్రాస్ అవ్వకు చూసుకుందాం అని నభా గట్టిగా ఇచ్చేసింది. అయినా ప్రియదర్శి ఆగలేదు, ఆ కౌంటర్ కి వై దిస్ కొలవెరి అంటూ ఫన్నీగా రిప్లే ఇచ్చాడు. దీంతో ఈ కన్వర్జేషన్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే ప్రియదర్శి, నభా కావాలనే ఫన్నీగా ఈ ట్వీట్స్ చేసుకున్నారని కొంతమంది నెటిజ్స్ అంటున్నారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.