Actress Sneha : మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావే ఎలా అనే పాటతో కుర్రాళ్ల హృదయాలను చదోచేసింది ఒకప్పటి హీరోయిన్ స్నేహ. తమిళమ్మాయి అయినా తన కట్టు బొట్టుతో టాలీవుడ్ తెలుగు అమ్మాయిలా తెరముందు కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తరుణ్ హీరోగా నటించిన ప్రియమైన నీకు సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మ్యాజిక్ చేసి అందరి మనసులను దోచేసింది. ఆ తర్వాత కుటుంబనేపథ్యం ఉన్న సినిమాల్లో నటించి అందం, అభినయంతో అందరి మనసులను గెలుచుకుంది. తరుణ్, వేణు, రవితేజ,ఇలా చాలా మంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుని వావ్ అనిపించింది. ఈ తర్వాత 2009లో తమిళ హీరో ప్రసన్న కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పెళ్లైన తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తుంది. అలాగే పలు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తోంది. స్నేహ చివరగా మమ్ముట్టి నటించిన ‘క్రిస్టోఫర్’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు.
ఇదిలా ఉంటే.. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన భర్త గురించిన ఓ సీక్రెట్ రివీల్ చేసింది. అందరినీ షాక్ కి గురి చేసింది. ” అందరికీ పొజెసివ్‌నెస్ ఉండాలి కానీ మరీ అతిగా ఉండకూడదు. ముఖ్యంగా కపుల్స్ మధ్య అది ఉండకూడదు. కపుల్స్ మధ్య నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఒక్కోసారి గొడవలు వస్తాయి. పార్ట్‌నర్ ఎక్కడికైనా వెళ్లేప్పుడు..ఎక్కడికి? ఎందుకు? అని అనుమానించొద్దు. తమ భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావు. అందుకే ఇద్దరి మధ్య నమ్మకం కచ్చితంగా ఉండాలి అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదే విధంగా భర్త , భర్య అడకముందే ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలి. అప్పుడు ఎలాంటి పొజెసివ్‌నెస్ రాదు. అదే విధంగా మనం వెళ్లాలనుకున్న చోటుకి వెళ్లాక ఫోన్ చేసి చెప్తే బెటర్. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.
లైఫ్ పార్టనర్ కాసేపు ప్రేమగా మాట్లాడితే చాలు వారి రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నా భర్త కూడా ఒకప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ కొన్ని కారణాల వల్ల వరిద్దరూ బ్రేకప్ అయ్యారు. ఈ విషయం నాకు తెలుసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ బ్రేకప్ వల్లే ప్రసన్న నా భర్త అయ్యాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకదానివల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను.. సంవత్సరం పాటు అలాగే గడిపాను. అప్పుడే నాకు ఓ అవార్డ్ రావడంతో..దానిని నుంచి బయట పడ్డాను. ఇప్పుడు నా ఫ్యామిలీ తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను”అని స్నేహ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.