MSVG Trailer Review: మన శంకరవరప్రసాద్ గారు..మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎలా ఉంటుందో తెలియని ఇద్దరే ఇద్దరు..ప్రస్తుతం ఉన్నారు. వారిలో ఒకరు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి..ఇంకొకరు అనిల్ రావిపూడి. ఈ దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.
రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి అనే పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్నాడు. ఇక, అనిల్ రావిపూడి..మెగాస్టార్‌తో మన శంకరవరప్రసాద్ గారు రూపొందిస్తున్నాడు. ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ దర్శకుడి నుంచి వచ్చిన సినిమాలు చూస్తే పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా వచ్చినవే. జంధ్యాల, ఈవీవీలని మిక్సీలో వేసి తిప్పితే అనిల్ రావిపూడి వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు.
అలాంటి దర్శకుడితో మెగాస్టార్ కామెడీ సినిమా అంటే అందరిలో ఉండే అంచనాలు ఇంకో రేంజ్. పైగా వింటేజ్ మెగాస్టార్‌ని చూపిస్తానన్న అనిల్..అదే పనిలో ఉన్నాడు. అయితే, 70 పదుల వయసులో మెగాస్టార్‌ని వింటేజ్ మెగాస్టార్‌గా ఎలా చూపిస్తాడో అనిల్..ఇది మరీ కామెడీ అనే కామెంట్స్ వినిపించాయి. పైగా కొత్త ఫార్ములా కాదనే మాటను విన్నాము. దీంతో, మన శంకరవరప్రసాద్ గారు సినిమా మీద కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి.
వాటన్నిటినీ తాజాగా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ తీర్చేసింది. ట్రైలర్ వచ్చాక అంచనాలు రెట్టింపయ్యాయి. మెగాస్టార్, వెంకీ, నయనతారల లుక్స్..ఫన్ అండ్ యాక్షన్ సీన్స్..ఇలా అన్నీ సినిమాలో హైలెట్ కాబోతున్నాయని అనిల్ చెప్పకనే చెప్పాడు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ ఖచ్చితంగా 300 కోట్ల మార్క్‌ను చేరుకోవడం చూస్తారని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకైతే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం కంప్లీట్ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. మరి, చిరు-అనిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ సాధిస్తారో చూడాలి.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.