AR Rahman: మెగా 158 కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ ఫిక్సైయ్యాడా?

AR Rahman: మెగా 158 కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ ఫిక్సైయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మన శంకరవరప్రసాద్ గారు భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక, ఈ సినిమా తర్వాత చిరు, బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సమ్మర్ నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక పీరియాడికల్ కథ అని కూడా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకముందు బాబీ..వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్‌కి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. దాంతో, మరోసారి ఇదే కాంబోలో సినిమా అనేసరికి అంచనాలు బాగానే మొదలయ్యాయి.

is-ar-rehaman-fixed-as-a-music-director-for-mega-158

AR Rahman: మెగా 158 సినిమాకి సంబందించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, ఇప్పుడు మెగా 158 సినిమాకి సంబందించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే, చిరు-బాబీ కాంబోలో మొదలయ్యే మెగా 158 చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్సైయ్యాడని. అతనెవరో కాదు, ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం రెహమాన్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్, ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి.

దీంతో రెహమాన్ చేతికి మెగా 158 బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీ హీరోలకి మ్యూజిక్ అందించే ఛాన్స్ అందుకున్న రెహమాన్‌కి టాలీవుడ్‌లో మరికొన్ని వరుస ఆఫర్స్ రావడం పక్కా అనుకోవచ్చు. మరి, దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పటివరకూ చిరు సినిమాలకి మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, థమన్ సంగీతమందించారు. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు సినిమాకి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మెగా 158 కి ఛాన్స్ ఏఆర్ రెహమాన్ దక్కించుకుంటే నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఉండబోతుందనుకోవచ్చు.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.