MSVG Trailer Review: మన శంకరవరప్రసాద్ గారు..ఒక్క ట్రైలర్‌తో అన్నీ తీర్చేశారుగా

MSVG Trailer Review: మన శంకరవరప్రసాద్ గారు..మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎలా ఉంటుందో తెలియని ఇద్దరే ఇద్దరు..ప్రస్తుతం ఉన్నారు. వారిలో ఒకరు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి..ఇంకొకరు అనిల్ రావిపూడి. ఈ దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.

రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి అనే పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్నాడు. ఇక, అనిల్ రావిపూడి..మెగాస్టార్‌తో మన శంకరవరప్రసాద్ గారు రూపొందిస్తున్నాడు. ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ దర్శకుడి నుంచి వచ్చిన సినిమాలు చూస్తే పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా వచ్చినవే. జంధ్యాల, ఈవీవీలని మిక్సీలో వేసి తిప్పితే అనిల్ రావిపూడి వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు.

msvg-mana-shankara-vara-prasad-garu-trailer-review

MSVG Trailer Review: మెగాస్టార్ కామెడీ సినిమా అంటే అందరిలో ఉండే అంచనాలు ఇంకో రేంజ్.

అలాంటి దర్శకుడితో మెగాస్టార్ కామెడీ సినిమా అంటే అందరిలో ఉండే అంచనాలు ఇంకో రేంజ్. పైగా వింటేజ్ మెగాస్టార్‌ని చూపిస్తానన్న అనిల్..అదే పనిలో ఉన్నాడు. అయితే, 70 పదుల వయసులో మెగాస్టార్‌ని వింటేజ్ మెగాస్టార్‌గా ఎలా చూపిస్తాడో అనిల్..ఇది మరీ కామెడీ అనే కామెంట్స్ వినిపించాయి. పైగా కొత్త ఫార్ములా కాదనే మాటను విన్నాము. దీంతో, మన శంకరవరప్రసాద్ గారు సినిమా మీద కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి.

వాటన్నిటినీ తాజాగా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ తీర్చేసింది. ట్రైలర్ వచ్చాక అంచనాలు రెట్టింపయ్యాయి. మెగాస్టార్, వెంకీ, నయనతారల లుక్స్..ఫన్ అండ్ యాక్షన్ సీన్స్..ఇలా అన్నీ సినిమాలో హైలెట్ కాబోతున్నాయని అనిల్ చెప్పకనే చెప్పాడు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ ఖచ్చితంగా 300 కోట్ల మార్క్‌ను చేరుకోవడం చూస్తారని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకైతే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం కంప్లీట్ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. మరి, చిరు-అనిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ సాధిస్తారో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.