MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 190 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కొనసాగుతోంది. ఈ రేంజ్ హిట్ పడి చిరుకి చాలాకాలం అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. సినిమా చేయడమే తప్ప ప్రమోషన్స్ అంటే ససేమిరా అనే నయనతారతో అనిల్ ప్రమోషన్స్‌కి కూడా ఒప్పించారు.
ఇక, వెంకీ ఇచ్చిన గెస్ట్ అపీరియన్స్ ఈ సినిమాకి మరో అడిషనల్ అట్రాక్షన్. మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో ఆద్యంతం మెగాస్టార్ పర్ఫార్మెన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి స్వాగ్, లుక్స్, డాన్స్, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్..ఇలా ప్రతీది ఈ సినిమా సక్సెస్‌కి కారణమయ్యాయి. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్‌తో మన శంకరవరప్రసాద్ గారు రఫ్ఫాడిస్తున్నారు. సినిమా ప్రారంభమైనప్పుడే అనిల్ రావిపూడి సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అంటూ అంచనాలు పెంచాడు.
అలాగే, ఇప్పటి వరకూ మన శంకరవరప్రసాద్ గారు మూవీ వరల్డ్ వైడ్‌గా 190 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఇంకా, ఎక్కువగానే నమోదయ్యాయి. మొత్తానికి, 200 కోట్లకి చేరువలో ఉంది. ఇది బాస్ స్టామినా. పాన్ ఇండియా సినిమాలే అన్నో అంచనాల మధ్య వచ్చి చతికిల పడుతున్నాయి. కానీ, చిరంజీవి మాత్రం ఒక్క భాషలో వచ్చే కొత్త రికార్డ్స్ సాధిస్తున్నారు. 5 సినిమాలు పోటీ ఉన్నప్పటికీ, అవేవీ బాస్ సినిమా వసూళ్ళకి అడ్డంకి కాలేదు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ సాధించిన సక్సెస్‌ల కంటే మన శంక్రవరప్రసాద్ గారు సినిమాతో సాధించిన సక్సెస్ ఎంతో ప్రత్యేకం.
ఇక, చిరంజీవి కూతురు మన శంకరవరప్రసాద్ గారు సినిమాకి ఓ నిర్మాత అయిన సుష్మిత కొణిదెల ఈ సినిమా రిలీజ్ కి ముందు నాన్న సినిమా గ్యారెంటీగా 300 కోట్ల గ్రాస్ క్రాస్ చేస్తుందని ఎంతో నమ్మకంగా చెప్పింది. ఇప్పుడు, బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ వేవ్ చూస్తుంటే అది పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. గత సంక్రాంతికి అనిల్ రావిపూడి-వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు, 2026 సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో ఆ మార్క్‌ను మెగాస్టార్ దాటబోతున్నాడని క్లియర్‌గా తెలుస్తోంది.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
Puri-Slum Dog: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని ఫిక్స్…
This website uses cookies.