Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ క్రేజీ మూవీని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారో వెల్లడించారు మేకర్స్. న్యూఇయర్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ ప్రతీ ఒక్కరికీ మెంటలెక్కిపోయే అప్‌డేట్ ఇచ్చి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథిదిగా వచ్చి స్పిరిట్ మూవీ ఓపెనింగ్ జరిపారు.

ఆ తర్వాత సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్‌ని డిసెంబర్ నెలలోనే కంప్లీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. జనవరి 9న ది రాజాసాబ్ సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం డార్లింగ్ ప్రభాస్ స్ప్రిట్ సినిమాకి చిన్న బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిందని సమాచారం. ఇక, 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్‌టైన్ చేయడానికి ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ తమ సినిమాలతో వచ్చారు.

spirit-movie-release-date-announced-march-5th-2027

Spirit Movie Release Date: ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశాడు.

ఇక, కొత్త సినిమాలకి సంబందించిన అప్‌డేట్స్ కూడా వచ్చాయి. వాటిలో కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందబోతున్న ‘ఎల్లమ్మ’ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చి అందరినీ ఎంతో ఎగ్జైట్ చేసింది. ఈ సినిమాలో హీరోగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ‘పర్షి’ పాత్రలో అలరించబోతున్నాడు. రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. అలాగే, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాకి ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్‌తో పాటు విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ని వదిలారు.

ఇలా, వరుసగా కొత్త సినిమాల అప్‌డేట్స్ వచ్చి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపాయి. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగ కూడా మన డార్లింగ్ ప్రభాస్‌తో చేస్తున్న కాప్ స్టోరీ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశాడు. 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం మార్చ్ 5 అంటే స్టూడెంట్స్ అందరూ ఎగ్జాంస్ తో చాలా బిజీగా ఉంటారు. మరి, ఈ విషయాన్ని మర్చిపోయాడా సందీప్ రెడ్డి అనేది తెలియదు గానీ, మార్చ్ ని టార్గెట్ చేస్తూ ప్రకటించడం మాత్రం ఆసక్తికరం. కాగా, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి నటిస్తోంది. వీరి ఫస్ట్ లుక్‌తో ఇంటర్నెట్ షేక్ అయిన సంగతి తెలిసిందే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.