Categories: EntertainmentLatest

Mrunal Thakur : సీత అందాలతో షేక్ అవుతున్న ఇంటర్నెట్‌..గులాబీ రంగు దుస్తుల్లో గుబాలిస్తున్న సోయగాలు

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా తన ఛార్మింగ్ క్యూట్ లుక్స్ తో అమాయకపు నవ్వులతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసేసింది. సీతారామమ్‌లో నూర్జహాన్ గా, రామ్ కి ప్రేయసిగా తన యాక్టింగ్‌ తో ఇరగదీసింది ఈ చిన్నది. మరాఠీ ముద్దుగుమ్మే అయినా తెలుగు అమ్మాయిగా చక్కగా సంప్రదాయ లుక్ లో కనిపించి, కవ్వించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

mrunal-thakur-stunning-looks-in-amazing-rose-pink-lehenga-setmrunal-thakur-stunning-looks-in-amazing-rose-pink-lehenga-set
mrunal-thakur-stunning-looks-in-amazing-rose-pink-lehenga-set

బాలీవుడ్, టాలీవుడ్ లో అందివస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఈ చిన్నది ఇండస్ట్రీలో తన జర్నీని కంటిన్యూ చేస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఫ్యాషన్ షో లలో షో స్టాపర్‌గా, ఫ్యాషన్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. తాజాగా ఈ చిన్నది ట్రెడిషనల్ లుక్‌లో హాట్ ఫోటో షూట్ చేసి యూత్‌ను ఫిదా చేసింది. ధగధగా మెరిసే అందాలతో అభిమానులను అలరిస్తోంది.

mrunal-thakur-stunning-looks-in-amazing-rose-pink-lehenga-set

నాలుగు సంవత్సరాల విరామం తర్వాత, డిజైనర్ ద్వయం అబు జానీ , సందీప్ ఖోస్లాలు కసిని ఫ్యాషన్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముంబైలోని జియో గార్డెన్‌లో ది క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్‌తో కలిసి నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో కు బ్యూటీ మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేదిలు షో స్టాపర్‌లుగా వ్యవహరించారు. వీరిద్దరూ అబు, సందీప్‌ లు రూపొందించిన అసల్, మర్ద్ అనే రెండు అద్భుతమైన కలెక్షన్‌లను ఆవిష్కరించారు.

mrunal-thakur-stunning-looks-in-amazing-rose-pink-lehenga-set

రాజస్థాన్ ట్రైబ్స్ కల్బెలియా నుండి ప్రేరణ పొందిన అనేక డిజైన్‌లను ఈ అవుట్‌ ఫిట్స్‌లో అద్భుతంగా సజీవంగా చూపించారు డిజైనర్లు. రష్యా దేశ కళా వారసత్వం, మొఘల్ , ఆర్ట్ డెకో ఆర్కిటెక్చర్ ను , విభిన్న సంస్కృతులను, సృజనాత్మకతను ఏకం చేసి అసాధారణమైన డిజైన్స్ లో దుస్తులను డిజైన్ చేశారు. ఈ డిజైనర్ షో లో ముంతాజ్, జాలి-మిర్రర్ సీక్విన్స్ శ్రేణులు అద్భుతంగా చూపించి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నారు. ఈ షోలో మృణాల్ అద్భుతమైన రోజ్ పింక్ నెమలి ఘాగ్రాను వేసుకుని సమ్మర్ బ్రైడ్ లుక్ లో అద్భుతంగా కనిపించింది.

mrunal-thakur-stunning-looks-in-amazing-rose-pink-lehenga-set

రెడ, బ్రైట్ పింక్ రేషమ్ రంగులతో హైలైట్ చేయబడిన మిర్రర్‌లతో ఎంబ్రాయిడరీ చేసిన, ఈ గులాబీ ఘాగ్రాను వైబ్రెంట్ సిల్క్ డిటైలింగ్‌తో పూర్తి చేశారు. ఇక సిద్ధాంత్ చతుర్వేది మిర్రర్ వర్క్‌తో వచ్చిన సీ గ్రీన్ కుర్తా పైజామాను ధరించాడు. వీరిద్దరూ జోడీగా ర్యాంప్‌పై నడిచి వారి కెమిస్ట్రీతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.

mrunal-thakur-stunning-looks-in-amazing-rose-pink-lehenga-set

సోషల్ మీడియాలో మృణాల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ తరచుగా తన ఫోటో షూట్‌కు సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. షూటింగ్ పిక్స్ ను ఫ్యాషన్ ఈవెంట్లను, పార్టీలకు అటెండ్ అయిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ తో కనెక్టివిటీ మెయిన్‌టైన్ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫ్యాషన్ ఈవెంట్‌కు సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ఫ్యాషన్ లవర్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఫ్యూచర్ బ్రైడ్స్ ను ఇంప్రెస్ చేశాయి.

mrunal-thakur-stunning-looks-in-amazing-rose-pink-lehenga-set
Sri Aruna Sri

Recent Posts

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

2 weeks ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

4 weeks ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

1 month ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

2 months ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

3 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

3 months ago