Mrunal Thakur: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. భారీబడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ మార్చి 20 తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే తారక్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన సెట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. ఫిక్షనల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ ద్వీపాన్ని సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దాని బ్యాక్ డ్రాప్ లోనే మూవీ కథ మొత్తం నడుస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇక ఈ మూవీ కోసం అన్ని భాషల నుంచి ఆర్టిస్ట్స్ ని ఎంపిక చేసే పనిలో దర్శకుడు కొరటాల శివ ఉన్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ నుంచి విక్రమ్, విజయ్ సేతుపతిలో ఒకరిని తారక్ కి ప్రతినాయకుడుగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి. అలాగే కొరటాల మరోసారి మోహన్ లాల్ ని తారక్ కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరి కాంబోలో గతంలో జనతా గ్యారేజ్ వచ్చింది. అలాగే హిందీ నుంచి సైఫ్ ఆలీఖాన్ ని కూడా సంప్రదిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యిందనే టాక్ వినిపించింది. అయితే ఆమె ఇంకా ఖరారు కాలేదని. ప్రస్తుతం సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ తో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మృణాల్ ఠాకూర్ అయితే హిందీలో కొంత హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమెని ఖరారు చేసే అవకాశం ఉండనే టాక్ బలంగా వినిపిస్తుంది. అలాగే కీర్తి సురేష్, రష్మిక మందన పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.