Mouni Roy : బాలీవుడ్ బ్యూటీ, నటి మౌని రాయ్ తన తాజా ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. తన పాల మీగడలాంటి అందాలతో అభిమానుల హృదయాలను దోచేస్తోంది. వింటేజ్ స్టైల్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు క్రేజీ క్యాప్షన్ ను జోడించింది ఈ చిన్నది. ఒక వ్యక్తి తన హృదయంతో మాత్రమే సరిగ్గా చూడగలడు అని కాప్షన్ పెట్టింది. మౌని తన ట్రెండీ దుస్తులను ప్రదర్శిస్తూ కెమెరా కోసం అద్భుతమైన భంగిమలను ఇస్తూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది.
డీప్ హాల్టర్ నెక్‌లైన్, ఫ్రంట్ టై-అప్ వివరాలు, అమర్చిన బస్ట్, మిడ్‌రిఫ్-బేరింగ్ , సూపర్-క్రాప్డ్ హేమ్ పొడవుతో వచ్చిన బూడిద రంగు బ్రాలెట్ వేసుకుంది మౌని రాయ్. దానికి జోడిగా నలుపు రంగు షీర్ టై-అప్ , తొడ ఎత్తు వరకు చీలిక తో వచ్చిన చీరను ధరించింది. ఫోటోషూట్ కోసం చెప్పులు లేకుండా పోజులిచ్చింది మౌని.
ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఉపకరణాలను ఎన్నుకుంది మౌని. మౌని ఆక్సిడైజ్డ్ వెండి ఆభరణాలను అలంకరించుకుంది. చైన్ లింక్ చోకర్ తన మేడలో వేసుకుని, చేతికి బ్రాస్‌లెట్ పెట్టుకుని , అదరగొట్టింది ఈ బ్యూటీ.
మౌని తన వింటేజ్ లుక్ కి తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది. మౌని గ్లామ్ పిక్స్ కోసం కనులకు స్మోకీ ఐ షాడో, సొగసైన ఐలైనర్, కనురెప్పల మీద హెవీ మాస్కరా పెట్టుకుని కనుబొమ్మలను హైలెట్ చేసింది. పెదాలకు న్యూడ్ లిప్ షేడ్, దిద్దుకుని తన గ్లామర్ తో అదరగొడుతోంది. గజిబిజిగా అల్లిన పోనీటైల్‌తో స్టార్ పాతకాలపు ఫోటోషూట్‌కు తుది మెరుగులు దిద్దింది.
టెలివిజన్ లో నాగిన్ సీరియల్ తో ఫేమస్ అయ్యింది బ్యూటీ ,మౌని రాయ్ . సీరియల్ లో నాగిని పాత్రకు ఈ భామ తప్ప మరెవరు న్యాయం చేయరు అనేంతగా తన యాక్టింగ్ తో అదరగొట్టింది. అప్పట్లోనే టీవీ లో ఓ రేంజ్ లో తన అందాలని ఆరబోసేది మౌని. సీరియల్ ద్వారానే ఈ బ్యూటీ కి సినిమాల్లో అవకాశాలు అందాయి. మౌని రాయ్ బ్రహ్మాస్త్ర లో నెగటివ్ రోల్ పోషించింది. ఆ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటో సూట్ లతో ఆదరగొడుతోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.