Michael Jackson – Prabhu Deva : మైకేల్ జాక్సన్ బయోపిక్‌లో ప్రభుదేవా..?

Michael Jackson – Prabhu Deva : ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తున్న కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాల గురించి ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఓ సూపర్ పాప్ సింగర్ కమ్ డాన్సర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్‌లో నటించబోతున్నారని. ఇది నిజమేనంటూ ఇప్పుడు అంతటా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గురించే ఎప్పటినుంచో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్, ప్రభుదేవా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

michael-jackson-biopic-with-prabhu-deva

మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో..ఎప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతుందో తెలియాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్ళాల్సిందే.

మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత కూడా ఆయనను, ఆయన పాప్ సాంగ్స్‌ను ఈ ప్రపంచం మరిచిపోలేదు. బ్రేక్ డాన్స్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నంతకాలం మైఖేల్ జాక్సన్ బ్రతికే ఉంటాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, పాప్ సంగీతం వినిపించేంత వరకు మైఖేల్ జాక్సన్ పాడిన పాటలు ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల వినిపిస్తూనే ఉంటాయని పలు సందర్భాలు రుజువు చేస్తున్నాయి.

Michael Jackson – Prabhu Deva : ప్రభుదేవా అయితేనే ఆ పాత్రకి న్యాయం చేయగలడు.

ఇక ఇప్పటికీ మైఖేల్ జాక్సన్ మృతి పెద్ద మిస్టరీగానే ఉంది. యాభై (50) ఏళ్ళ వయస్సులో మైఖేల్ అనారోగ్యంతో చనిపోయాడు. కానీ, ఇది చాలామంది నమ్మడం లేదు. మైఖేల్ మీద విషప్రయోగం జరిగిందని వాదిస్తున్నారు. ఇక ఆయన పాప్ రారాజుగా ఎదిగే క్రమంలో నల్ల జాతికి చెందిన వాడని ఎన్నో రకాలుగా అవమానించారు. వాటన్నిటినీ తట్టుకొని చాలాసార్లు సర్జరీలు చేయించుకొని తెల్లజాతీయుడిగా మారాడు.

michael-jackson-biopic-with-prabhu-deva

అయితే, ఇప్పుడు హాలీవుడ్‌లో మైఖేల్ జాక్సన్ బయోపిక్ రూపొందనుంది. దీనికి మేకర్స్ రంగం సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాకి అంటోనియో ఫుకో దర్శకత్వం వహించబోతున్నాడు. 3 సార్లు ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన జాన్ లోగన్ కథ అందిస్తున్నారు. ఇక మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన తమ్ముడు కొడుకు, పాప్ సింగర్ కమ్ డాన్సర్ జాఫర్ జాక్సన్ పోషిస్తున్నాడు. కానీ, మన ఇండియన్స్ మాత్రం మైఖేల్ జాక్సన్ పాత్రలో ప్రభుదేవా అయితేనే ఆ పాత్రకి న్యాయం చేయగలడని చెప్పుకుంటున్నారు. హాలీవుడ్‌లో అయితే మన ఇండియన్స్ అనుకున్నది జరిగే అవకాశం లేదు. కానీ, సౌత్ భాషలలో గనక మైఖేల్ జాక్సన్ బయోపిక్ నిర్మిస్తే మన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా అయితేనే కరెక్ట్ అంటున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

3 days ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

4 days ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

4 days ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

3 weeks ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 month ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

2 months ago

This website uses cookies.