TS Politics: తెలంగాణలో అధికారంలోకి రావడానికి దొరికిన అవకాశాన్ని బీజేపీ బలంగా వినియోగించుకోవాలని అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అస్థిరత, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసి వస్తుందని బండి సంజయ్ టీమ్ ఆలోచిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం అంత తేలికైన విషయం కాదని బీజేపీ పార్టీ పెద్దలకి కూడా తెలుసు. ఈ నేపధ్యంలోనే ఆరు నెలల ముందుగానే తెలంగాణలో ఎన్నికల వ్యూహాలని అమిత్ షా సిద్ధం చేశారు. టార్గెట్ 90 పేరుతో ప్రజలలోకి బలంగా వెళ్ళే ప్రయత్నం మొదలు పెట్టారు. స్థానికంగా బూత్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేసి బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకునే పనిలో బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది.
అలాగే నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు కూడా నిర్వహించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఎప్పటికప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. అలాగే కేంద్రంలోని మంత్రులు కూడా రెగ్యులర్ గా రాష్ట్రానికి వస్తున్నారు. తాజాగా మరో కేంద్ర మంత్రి త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర నాయకులతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో తెలంగాణలో అమలు చేయాల్సిన వ్యూహాల గురించి చర్చించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. మరి వైపు అమిత్ షా ఇచ్చిన రోడ్ మ్యాప్ ని తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే అమల్లో పెట్టి తమ కార్యాచరణకి కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఏపీలో కూడా లేనంత రాజకీయ వేడి తెలంగాణలో ఉండటం విశేషం. ముఖ్యంగా బీజేపీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.