Manisha Koirala : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సిరీస్ గా రికార్డ్ సృష్టించింది. విమర్శకుల ప్రశంసలను సైతం ఈ మూవీ అందుకుంది. ఈ సిరీస్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రూపొందించినా సౌత్ లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా బీలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఈ సిరీస్ కు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇందులో వేశ్య మల్లికా జాన్ గా ఒక కీలక పాత్రలో కనిపించిన మనీషా కొయిరాలా ఆ పాత్రకు నూటికి నూరు శాతం జీవం పోసింది. మనీషానే కాదు సౌత్ బ్యూటీ అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హాలతో పాటు బాలీవుడ్ నటుల తమ యాక్టింగ్ తో అందరిని బాగా ఆకట్టుకున్నారు.
అయితే తాజాగా మనీషా ఓ ఇంటర్వ్యూలో హీరామండిలో తన క్యారెక్టర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. ఓ సీన్ కోసం మనీషా ఏకంగా 12 గంటలకు పైగా బురద నీటిలో నానాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సీన్ పండాలనే ఉద్దేశంతో చివరివరకు డైరెక్టర్ తనను వదలలేదని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు హీరామండిలో తన క్యారెక్టర్ తన సినీ కెరీర్ లోనే ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
” నాకు 50 ఏళ్లు.ఈమధ్యనే క్యాన్సర్ నుంచి బయటపడ్డాను. ఒకప్పుడు అంతా అయిపోయిందని అనుకున్నాను. నా లైఫ్ టర్న్ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఇవాళ నాకు వస్తున్న ప్రశంసలను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి హీరామండి షూటింగ్ ముందు నన్ను ఎన్నో సందేహాలు వేధించాయి. ఎన్నో ఆందోళనలు ఎదుర్కొన్నాను. నా శరీరం ఈ భారీ దుస్తులను, ఆభరణాలను ,షూటింగ్ షెడ్యూల్‌లను తట్టుకుంటుందో లేదో తెలియదు. ఇక హీరామండిలో ఓ సీన్ మాత్రం నాకు పెద్ద సవాల్ గా నిలిచింది. నీళ్లలో 12 గం.లు పైగా నానే సీన్ అది. ఆ ఫౌంటెన్ సీక్వెన్స్ నాకు, నా శారీరానికి పెద్ద సవాల్ గా మారింది. నన్ను 12 గంటలకు పైగా ఫౌంటెన్‌లో నిమజ్జనం చేసారు. నీరు వెచ్చగా, క్లీన్ గా ఉందని డైరెక్టర్ చెప్పినా గంటలు గడిచేకొద్దీ ఆ నీరే బురదగా మారింది. నా శరీరంలోని ప్రతి రంధ్రం ఆ బురదలో తడిసిపోయింది. షూటింగ్ పూర్తైన తర్వాత నా శరీరం అలసిపోయినా, నా హృదయంలో ఘాడమైన ఆనందాన్ని అనుభవించాను. కాస్త స్ట్రెస్ ఫీల్ అయినా నా శరీరం చాలా దృఢంగా ఉంది” అని మనీషా తెలిపారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.