Manish Kumar : ఈ మధ్యకాలంలో విడుదలైని కామెడీ హారర్ మూవీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓ వైపు దెయ్యాలతో భయపెడుతూనే మరోవైపు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. రీసెంట్ గా ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో హిట్ సాధించడమే కాదు ఓటీటీలోనూ ఇరగదీస్తోంది. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. శ్రీ హర్ష కొనుగంటి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్ తో పాటు పలువురు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించారు.
ఓం భీమ్ బుష్ మూవీలో ఎప్పటిలాగే శ్రీవిష్ణు తన నటనతో అలరించారు. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ సెన్స్ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. ఈ కాంబినేషన్ గతంలో కూడా హిట్ అయ్యింది. బ్రోచేవారెవరురా సినిమాలో రాహులు, శ్రీవిష్ణు,ప్రియదర్శిలు అలరించారు. అదే ఫార్ములతో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఈ మూవీలోని సంపంగి దెయ్యం క్యారెక్టర్ హైలెట్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ సంపంగి , శ్రీవిష్ణుల మెలడీ సాంగ్ కు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ దెయ్యం పాత్ర మొదట్లో నవ్వించినా..క్లైమాక్స్ లో మాత్రం అందరినీ ఎమోషనల్ గా కదిలించింది. ఇక ఈ దెయ్యం పాత్రలో నటించింది ఎవరు అని నెటిజన్స్ వెతకడం మొదలుపెట్టారు.
సంపంగి దెయ్యం పాత్రలో నటించింది వ్యక్తి పేరు మనీష్ కుమార్. ఇతను క్లాసికల్ డాన్సర్. అందుకే ఈ సినిమాలో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. అబ్బాయే అయినా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . సంపంగా పాత్ర పోషించిన మనీష్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. సంపంగి అందరి మనసులు గెలుచుకోవడంతో రియల్ గా ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనీష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సంపంగి దెయ్యం ఇతనే అంటూ నెటిజన్స్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. హీరోలా ఉన్నాడంటు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.