Manchu Manoj : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తండ్రయ్యాడు. మనోజ్ బెటర్ హాఫ్ భూమా మౌనిక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా లో అనౌన్స్ చేసింది. దీంతో మనోజ్ మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. “మా ఇంటికి దేవత వచ్చింది. మనోజ్ కు పాప పుట్టింది. ఇప్పుడు మేం నలుగురుం అంటూ అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ రానే వచ్చేసింది. ఆ క్యూటీని మేము ఎంఎం పులి అని పిలస్తున్నాము. మా ఫ్యామిలీపై ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను. వారిని బ్లెస్ చేయండి”అని లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హ్యాపీ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇక మనోజ్‌కు పాప పుట్టడంతో మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే మంచు లక్ష్మీ మినహా మంచు కుటుంబం నుంచి ఇంకా ఎవరూ ఈ న్యూస్ పై రియాక్ట్ కాలేదు.
మంచు మనోజ్ భూమా మౌనికను లాస్ట్ ఇయర్ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. ఇదివరకే భూమా మౌనికకు ఓ బాబు ఉన్నాడు. ఇక మనోజ్ రెండో పెళ్లి తర్వాత ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి మనోజ్ విషయంలో అన్న విష్ణు దూరంగా ఉంటున్నాడు. మనోజ్ పెళ్లైన కొద్ది రోజులకే ఆయన ఇంటిపై మంచు విష్ణు దాడి చేసిన వీడియో అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. అయితే దీనిపై ఎవరూ స్పందించలేదు. మనోజ్ కూడా ఓ ఇంటర్వ్యూలో అన్నతో విభేదాలు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే దాటేశాడు. దీంతో మంచు ఫ్యామిలీలో విభేదాలు నిజమే అని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనోజ్ తన కెరీర్ పై దృష్టి పెట్టాడు. మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఏడేళ్ల తరువాత ”వాట్ ది ఫిష్” అనే మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
”వాట్ ది ఫిష్” అనే మూవీతో వెండితెరకు కొత్త దర్శకుడు వరుణ్ పరిచియం అవుతున్నారు. ఈ సినిమాలో మనోజ్ తో పాటు పలువులు సినీ ప్రముఖులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా కనిపించనుంది. మనోజ్ – నిహారిక చాలా గ్యాప్ తరువాత చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ తమ అభిమాన తారలు బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.