Manchu Lakshmi : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ సినిమా కోసం విష్ణు ఓ రేంజ్ లో కష్టపడుతున్నాడు. ముకేశ్ కుమార్‌సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టీజర్‌ను రీసెంట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్‌లు ఈ మూవీపై ఆసక్తిగా ఉన్నారు.దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కన్నప్పకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ నెట్టింట్లో ఒదులుతూ సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు విష్ణు. ఈ క్రమంలో అక్క మంచు లక్ష్మీ కన్నప్ప పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కన్నప్పలో నటించడం లేదని, విష్ణు అవకాశం ఇవ్వలేదు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మంచు లక్ష్మి యక్షిణి అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ లో లక్ష్మితో పాటు అజయ్, వేదికలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ కు తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
కన్నప్పలో మీరు నటించడం లేదా? అని అడిగిర ప్రశ్నకు లక్ష్మి స్పందిస్తూ..”కన్నప్పలో నటించడం లేదీ అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. నాకు సరిపోయే క్యారెక్టర్ ఆ మూవీలో లేదేమో అని అనుకుంటున్నాను. అందుకే విష్ణు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ మూవీలో నేనే కాదు మంచు మనోజ్ కూడా యాక్ట్ చేయడం లేదు. ఒకవేళ నేను, మనోజ్ కన్నప్పలో ఉండి ఉంటే అది మా ఫ్యామిలీ సినిమా అయ్యేది కదా. బెంగళూరు రేవ్‌పార్టీ గురించి అడగ్గా..అసలు ఆ పార్టీలో ఏం జరిగిందో నాకు తెలియదు. దాని గురించి మాట్లాడడానికి ఇది టైం కాదు” అని లక్ష్మి తెలిపింది.
పాన్ ఇండియా స్థాయిలో కన్నప్ప తెరకెక్కబోతోంది. జూన్ 13న ఈ మూవీ రిలీజ్ కానుంది. అందుకే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన షూటింగ్ కూడా ఈ మధ్యనే పూర్తయింది. మోహన్ బాబు తో పాటు పలు భాషలకు చెందిన స్టార్ హీరోలు మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, శరత్ కుమార్, డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.