News: దేశ ముదురు సినిమాలో ఈ శరీరంలో ఏముంది అంటే మాట్టే కదా అని హీరోయిన్ ఓ డైలాగ్ చెబుతుంది. అది ముమ్మాటికి నిజమే. మానవ శరీర నిర్మాణం మట్టి, నీటితోనే మేగ్జిమమ్ నిండి ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక గ్రంధాలలో కూడా ఆత్మకి చావులేదు. మరణం దేహానికి మాత్రమే అని మహర్షులు చెప్పారు. నిజమే మరణం ఈ దేహానికి మాత్రమే. మరణం తర్వాత ఈ శరీరంలో జీవాత్మ ఏం అవుతుందనేది ఎప్పటికి రహస్యమే. ఒక్కో మతం ఒక్కో విధంగా ఈ మానవ శరీరాన్ని వీడిన ప్రాణం ఉనికి గురించి చెప్పారు. ఎవరు ఎన్ని పంచభూతాల నిర్మితమైన ఈ శరీరాన్ని ఆత్మ వీడిన తర్వాత తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే కొన్ని మతాచారాలలో ఈ శరీరాన్ని దహనం చేస్తారు.
కొన్ని మతాలలో భూమిలోనే పాతేస్తారు. తరువాత శరీరంలో మట్టిలో పూర్తిగా కలిసిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత చూసుకుంటే తవ్విన చోట మనిషి ఎముకలు, అస్థిపంజరాలు మాత్రమే కనిపిస్తాయి. ఇతర శరీర అవయవాలు అన్ని మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో కలిసిపోయిన శరీరం సేంద్రీయ వ్యర్ధాలుగా మారిపోతుంది. అయితే ఈ సేంద్రీయ వ్యర్ధాలని ఎందుకు మళ్ళీ ఉపయోగించకూడదు అనే ప్రశ్న శాస్త్రవేత్తలకి వచ్చింది. జనాభా పెరిగిపోతున్న నేపధ్యంలో చనిపోతున్న మనుషులని పాతడానికి కూడా భూమిపై స్థలం ఉండటం లేదు.
బయోడిగ్రేడబుల్ పదార్ధాలని ఉపయోగించి వాటిని మృతదేహంపై వేసి 30 రోజుల పాటు భద్రపరుస్తారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి సహాయంతో శరీరంలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది శరీరం పూర్తిగా విచ్చిన్నం అవుతుంది. దానిని అత్యధిక టెంపరేచర్ వద్ద వేడి చేస్తారు. దీని ద్వారా అందులో ఉన్న హానికారక సూక్ష్మజీవులు చనిపోతాయి. ఇలా తయారైన వ్యర్ధాలని మొక్కలకి కంపోస్ట్ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎరువులని పంటపొలాలకి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఇంట్లో మొక్కలకి ఉపయోగించాలని అనుకుంటే మాత్రం సిమ్మెట్రీ కార్పొరేషన్ అనుమతులు తీసుకోవాలి. ఇక ఈ హ్యూమన్ కంపోస్టింగ్ ఎరువుపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని దానిని తయారు చేస్తున్న సంస్థలు తెలుపుతున్నాయి. భవిష్యత్తులో మానవ శరీరాన్ని ఇలా ఉపయోగం లేకుండా ఖననం చేయకుండా హ్యూమన్ కంపోస్టింగ్ గా మార్చే ప్రక్రియ అన్ని దేశాలకి విస్తరించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.