Rakhi Pournami: ప్రతి ఏడాది రాఖీ పండుగను అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ రాఖీ వేడుకను జరుపుకుంటారు ఈ పండుగ రోజు అక్క చెల్లెలు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి వారు ఏ విధమైనటువంటి ఆపదలలో ఉండకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా రాఖీ పండుగ రోజు తమ అక్క చెల్లెలు ఎక్కడ ఉన్నా కూడా తమ సోదరుడికి రాఖి పంపిస్తూ ఉంటారు అయితే రాఖీ పండుగ రోజు ఈ రాఖీ కట్టడానికి సరైన సమయం ఏంటి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు కూడా చాలా ముఖ్యం.
మరి పౌర్ణమి రోజు రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే…పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ భద్రుడి ప్రభావంతో ఉంటుంది. భద్ర సమయం ఆగస్టు 19 మధ్యాహ్నం 2:21 గంటలకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1:30 గంటలకు భద్ర ముగుస్తుంది. దీని తర్వాత సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టగలరు. శ్రావణ మాసం పౌర్ణమి తేదీ ఆగస్టు 19 ఉదయం 3:03 గంటలకు ప్రారంభమై రాత్రి 11:54 గంటలకు ముగుస్తుంది. అందుకే ఉదయతిథి ఆధారంగా రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19న మాత్రమే జరుపుకుంటారు.
ఇక ఈ రాఖీ పండుగ రోజు కొన్ని నియమాలను కూడా పాటించాలి రాఖీ కట్టడానికి ముందు ఒక ప్లేటులో దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి. ఇక రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడు తూర్పు వైపుకు తిరిగి ఉండాలి అలాగే ఒక కుర్చీలోన లేదా పీట పైన కూర్చోనేలాగ ఏర్పాటు చేసుకోవాలి అంతే కాకుండా రాఖీ కట్టించుకునేటప్పుడు ఏ విధమైనటువంటి లేదా వస్తువులను మీ సోదరుడు ఉపయోగించకుండా చూసుకోండి.
ఇక రాఖీ కట్టేటప్పుడు పొరపాటున కూడా నల్ల దుస్తులను మీరు కానీ మీ సోదరుడు కానీ ధరించకూడదు. సోదరీమణులు పసుపు, ఎరుపు, గులాబీ రంగుల దుస్తులను ధరించాలి. శాస్త్రాల ప్రకారం పురుషులు, పెళ్లికాని అమ్మాయిలు తమ కుడి చేతికి రక్షాసూత్రాన్ని కట్టుకోవాలి. వివాహిత స్త్రీలు తమ ఎడమ చేతికి రాఖీ కట్టాలనే నియమం ఉంది. ఇలా రాఖీ కట్టిన తర్వాత మీ కన్నా వయసులో మీ సోదరుడు పెద్దవాడు అయితే తప్పనిసరిగా వారికి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.