Health Tips: ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న ఛాతిలో నొప్పిగా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఇలా ఛాతిలో నొప్పి లేదా మంట ఉన్నప్పుడు చాలామంది ఎంతో కంగారు పడుతూ ఉంటారు. ఈ నొప్పి దేనికి సంకేతం ఏదైనా గుండె సమస్యలకు కారణమా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇలా తరచూ ఛాతిలో కనుక నొప్పి ఉన్నట్లయితే వెంటనే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇలా గుండెకు సంబంధించిన పరీక్షలలో అన్ని నార్మల్ గా ఉన్నప్పటికీ ఛాతిలో మంట ఉంది అంటే అది మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా వచ్చే గ్యాస్ సమస్య అనే చెప్పాలి.
ముఖ్యంగా జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు వస్తుంటాయి. దీని కారణంగా ఛాతితో పాటు గుండెలో అప్పుడప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు చాలావరకు వారు తీసుకొని ఆహార పదార్థాలలో ఉప్పు,కారం మసాలా వంటి వాటిని పూర్తిగా తగ్గిస్తూ ఉంటారు. ఇలా తగ్గించినప్పటికీ మంట తగ్గలేదు అంటే ప్రతిరోజు వారి ఆహారంలో భాగంగా పెరుగును చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజూ పరగడుపు రెండు చెంచాల పెరుగు తీసుకోవాలని చెబుతున్నారు. ఇది ఛాతిలో మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే నీరు తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. రోజులో కనీసం 3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చాలామంది భోజనం చేస్తున్న వెంటనే నిద్రపోతూ ఉంటారు ఇలా నిద్రపోవటం వల్ల కూడా జీర్ణక్రియ సమస్యలు తలెత్తి ఛాతిలో మంటగా ఉంటుంది. అందుకే తిన్న తర్వాత ఓ గంట పాటు మేలుకొని గంట తర్వాత నిద్రపోవటం మంచిది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.