Re heating: సాధారణంగా మనం ఏదైనా వంట చేసిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను మరుసటి రోజు కోసం ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటాము అయితే తిరిగి ఫ్రిడ్జ్ లోని ఆహార పదార్థాలను అలాగే తినకుండా వాటిని వేడి చేసి తింటూ ఉంటాము అయితే ఇలా వేడి చేసుకుని తినడం కొంతవరకు మంచిదైనప్పటికీ కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా మారుతున్న అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసే తినటం చేస్తే మనం పాయిజన్ తీసుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఉదయం టీ చేసిన తర్వాత ఆ టీని మళ్లీమళ్లీ వేడి చేసి తాగుతూ ఉంటారు ఇలా టీలు కూడా మళ్లీమళ్లీ వేడి చేసి తాగడం మంచిది కాదని చెబుతున్నారు అయితే ఏ ఆహార పదార్థాలను తిరిగి మళ్లీ మళ్లీ వేడి చేయకూడదనే విషయానికి వస్తే.. టీని తిరిగి వేడి చేయడం వల్ల ముఖ్యంగా గ్రీన్ టీలో కాటెచిన్స్ వంటి కొన్ని ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు క్షీణిస్తాయి.టీని తిరిగి వేడి చేయడానికి ముందు గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే, అది బ్యాక్టీరియా వృద్ధికి కేంద్రంగా మారుతుంది. ముఖ్యంగా అందులో పాలు లేదా చక్కెర ఉంటే మరింత హానికరం.
ఇక చాలామంది ఒకసారి వంటలకు ఉపయోగించిన నూనెను బాగా వేడి చేస్తూ మళ్ళీ మళ్ళీ వంటలు చేస్తూ ఉంటారు ఇలా ఒకసారి బాగా మరిగిన నూనెను తిరిగి మళ్లీ వాడటం మంచిది కాదు.నూనెల్ని పదేపదే వేడి చేసినప్పుడు ఆక్సీకరణకు గురవుతాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఇవి శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తాయి. ఇన్ఫ్లమేషన్ లాంటి వివిధ రకాల వ్యాధులకు దోహదం చేస్తుంది.పాలకూరను తిరిగి వేడి చేయడం వల్ల కొన్ని విటమిన్లు కోల్పోవలసి వస్తుంది అందుకే ఎప్పుడు కూడా పాలకూరను నూనె టి ఈ మూడు పదార్థాలను వేడి చేయకపోవడమే మంచిది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.