Categories: Tips

Lavanya Tripathi : లావణ్యకు మరో పెళ్లి ప్రపోజల్

Lavanya Tripathi : నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అనే ఒక్క డైలాగుతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన హీరోయిన లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో భలే భలే మగాడివోయ్, అక్కినేని నాగేశ్వరరావుతో సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాల హిట్ తో లావణ్యకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది.

lavanya-tripathi-another-marriage-proposal-for-mega-sister-in-law

వరుణ్ తో మిస్టర్ సినిమా చేసింది. ఆ మూవీతో లవ్, వరుణ్ మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ తెలియకుండా ఈ జంట సీక్రెట్‌గా తమ ప్రేమాయణాన్ని సాగించింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఫారెన్ లో ఘనంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వెకేషన్స్‌కు వెళ్తు ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ కపులు. కానీ గత కొంత కాలంగా లావణ్య సైలెంట్ అయిపోయింది. రీసెంట్ గా ఏపీలో ఘనంగా జరిగిన మెగా మామ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా లావణ్య రాలేదు. లావణ్య ఎందుకు రాలేదబ్బా అని ఆరా తీయగా, తన కాలికి గాయమై ఇంటికే పరిమితమైందని తెలిసింది.

lavanya-tripathi-another-marriage-proposal-for-mega-sister-in-law

ఈ క్రమంలో ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న లావణ్య లావణ్య సోషల్ మీడియాలో తమ అభిమానులతో టైంపాస్ చేస్తోంది. రీసెంట్ గా ఈ భామ తన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్ లావణ్యకు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. మేడం మీరంటే నాకు చాలా చాలా ఇష్టం, ఈ జన్మలో వరుణ్‌ను పెళ్లి చేసుకున్నారు కదా. కనీసం వచ్చే జన్మలోనైనా నన్ను పెళ్లి చేసుకోండి అని పాపం రిక్వెస్ట్ చేశాడు. అభిమాని ప్రపోజల్ కు లావణ్య షాక్ అయ్యింది.

lavanya-tripathi-another-marriage-proposal-for-mega-sister-in-law

ఇక మెగా కోడలు సమాధానం ఇస్తూ.. “పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మకు..ఇంకా చెప్పాలంటే జన్మ జన్మలకు వరుణే నా భర్త”అని సామాధానం ఇచ్చింది. లావణ్య సమాధానానికి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీనిని బట్టి లావణ్యకు వరుణ్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోందంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

10 hours ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 weeks ago

This website uses cookies.