Kota Bommali movie review: కోట బొమ్మాళి సినిమా రివ్యూ. ఇప్పుడు కావాల్సిన కంటెంట్ ఇదే

Kota Bommali movie review: ప్రస్తుతం అటు ఏపీలో ఇటు తెలంగాణాలో ఎలక్షన్ హడావుడి ఉంది. ఈ టైమ్‌లో రావాల్సిన సినిమా కోట బొమ్మాళి. ఈ మూవ్‌మెంట్ లో ఎలాంటి కథ కావాలో అలాంటి కథతోనే వచ్చిన కోట బొమ్మాళి చిత్రం పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల ముందుగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇక ఇప్పటికే కోట బొమ్మాళి మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ బాగానే సినిమాపై అంచనాలు పెంచాయి. అంతగా ఆసక్తి రేపిన ఈ చిత్రం ఎలా వుంది. ఇప్పుడు మన రివ్యూ లో తెలుసుకుందాం.

ఈ సినిమాలో ఉన్న లింగిడి లింగిడి పాటతో క్రేజ్ తెచ్చుకున్న కోట బొమ్మాళి.. ఇప్పుడు కంటెంట్ వల్ల బాగా మాట్లాడుకుంటున్నారు. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత కోట బొమ్మాళి పిఎస్‌పై మూవీ మీద భారీగా అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా పొలిటికల్ సీజన్ కాబట్టి ఈ టైమ్‌లో పక్కాగా అటువన్టి కథతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

Kota Bommali movie review

Kota Bommali movie review : మళ్ళీ ఇంతకాలాని అలాంటి పాత్రే

మలయాళ రీమేక్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు చాలా మార్పులు చేర్పులు చేశారు. పొలిటికల్ లీడర్స్ చేసే ఒత్తిడి వల్ల పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేదే కోట బొమ్మాళి చిత్ర కథా నేపథ్యం. శ్రీకాంత్ తన కెరీర్ బెస్ట్ ఇవ్వడానికి చాలా బాగా ట్రే చేసారు. గతంలో వచ్చిన ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ నటన అందరినీ ఆకట్టుకొని ప్రశంసలు అందుకున్నారు. మళ్ళీ ఇంతకాలాని అలాంటి పాత్రే మళ్ళీ దక్కింది.

ఇక ఈ సినిమా కోటబొమ్మాలి పిఎస్ లో జరిగే ఒక సంఘటనతో మొదలవుతుంది అక్కడ సిన్సియర్గా డ్యూటీ చేసే వెంకటరమణ పొలిటిషన్ కి తలనొప్పిగా మారుతాడు, మరి ఆ వెంకటరమణ తన కానిస్టేబుల్స్ ఇద్దరు చేసిన ఒక చిన్న పని వలన వాళ్ళు చిక్కుల్లో పడతారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఈ ముగ్గురిని పట్టుకోవడానికి ప్రయత్నించడమే ఉంటుంది ..! ఈ దశలో పోలీస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి , వీళ్ళ మంసాయిక స్థితి ఏంటి ..?! అనే అంశాల చుట్టూ సినిమా ఉంటుంది .

ఇక ఈ సినిమా కథ చాలా వరకు ట్రావెల్ లో సాగుతుంది. ఇందులో కొన్ని సీన్లు రిపీట్ అయినట్టు ఉన్నాయి. కానీ కథ ఆకట్టుకుంటే మాత్రం బగానే ఆదరిస్తారు. ఇక కోట బొమ్మాళి మూవీలో నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. నేపధ్య సంగీతం మాత్రం కాస్త ఆకట్టుకునేలా అనిపించదు. ద్వితీయార్థంలో ఎమోషన్ సీన్స్ బాగానే ఉన్నాయి. పోలీసులు పారిపోయాక వాళ్ళని పట్టుకునే డ్రామా ఆసక్తిగా సాగుతుంది.
డిఫరెంట్ సినిమాలు ఇస్టపడేవారికి కోట బొమ్మాళి ఖచ్చితంగా నచ్చుతుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

4 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

6 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.