Kollywood Heros : భాషతో సంబంధం లేకుండా హీరోలు ఎక్కడైనా సినిమాలు చేయవచ్చు. కానీ, సొంత భాషలో కాకుండా ఇంకో భాషలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అక్కడున్న స్టార్ హీరోలకి ధీటుగా నిలబడటం అంటే చాలా కష్టం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కత్తిమీద సామే అనుకోవచ్చు. తెలుగులో ఉన్న హీరోలకి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ భారీ స్థాయిలో క్రేజ్ దక్కుతుందంటే అది వారు పడుతున్న శ్రమ. ఎంచుకుంటున్న కథలు..దర్శకులు..నిర్మాణ విలువలనే చెప్పాలి.
కానీ, తమిళంలో మన హీరోలు స్ట్రైట్ సినిమాలు చేసి రాణించడానికి పెద్దగా సాహసించరు. అలాగే తమిళ, మలాయళ, కన్నడ, హిందీ హీరోలు పూర్తి స్థాయిలో ఇంకో భాషలో స్ట్రైట్ సినిమాను చేసి ఎదగాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. ప్రతీ ఇండస్ట్రీ ఫ్యాన్ బేస్డ్‌గానే కొనసాగుతున్నాయి. చిన్న గెస్ట్ రోల్ చేస్తే ఆదరించగలరేమో గానీ, హీరోగా అంటే ఇదుగో తమిళ స్టార్ హీరో విజయ్‌కి దక్కినట్టే ఫ్లాప్ పడుతుంది.
తెలుగు హీరోలు తమిళంలో ట్రై చేయకపోయినా..ఈ మధ్య కాలంలో తమిళ హీరోలు విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ తెలుగులో స్ట్రైట్ సినిమాలను కమిటయ్యారు. కానీ, అవి సక్సెస్ కావడం కష్టమే అని ఈ సంక్రాంతికి వచ్చి దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకున్న విజయ్‌ను చూస్తే అర్థమవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో విజయ్, రష్మిక మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారసుడు( వారిసు ) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో ఇప్పుడు ధనుష్, శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలపై జనాలలో సందేహాలు మొదలయ్యాయి.
ఇక మన హీరోలు మాత్రం తెలుగులో నటించిన సినిమాను అన్ని భాషలలో డబ్బింగ్ వర్షన్‌ను రిలీజ్ చేస్తే భారీ క్రేజ్‌ను దక్కించుకుంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రామ్మ్ చరణ్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్‌గా పాపులర్ అయ్యారు. వీరితో ఓ పాన్ ఇండియా సినిమా నిర్మిచాలంటే కనీసం 200 నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్ కావాల్సిందే. అదీ మన హీరోల రేంజ్ ప్రస్తుతం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.