Raveena-Tandon : తొడలతో ఇబ్బంది పడ్డ రావీనా టాండన్..ఆ అవకాశాలు వచ్చిపోయాయాట..

Raveena-Tandon : సోషల్ మీడియా రోజులు ఇవి. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పే కాలం అనే చెప్పాలి. ఒకప్పుడు అలనాటి నటీమణులు సినిమా ఇండస్ట్రీ లో ఎం జరిగినా ఎక్కడా రెవీల్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ లో చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియా పుణ్యమా ఇట్టే తెలిసిపోతోంది. ఇండస్ట్రీ లో ప్రధానంగా ఎదురయ్యే బాడీ షేమింగ్ అయినా , క్యాస్టింగ్ కౌచ్ గురించి అయినా నేటి తరం హీరోయిన్ లు సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయాన్ని వైరల్ చేస్తున్నారు. తనేం తక్కువేం కాదని అలనాటి బాలీవుడ్ తార అప్పట్లో తాను ఇండస్ట్రీ లో పేస్ చేసిన సమస్యలను చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో పంచుకుంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సినీ పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభంలో ఆమె ఎదుర్కొన్న బాడీ షేమ్ గురించి మాట్లాడారు.

raveena-tandon-Troubled-with- herthighs-

90వ దశకంలో తన అందాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది రవీనా . అప్పట్లో ఆమె ఐకానిక్ నంబర్ “టిప్ టిప్ బర్సా పానీ”ని సాంగ్ ను ప్రస్తుత తరానికి చెందిన ప్రముఖ నటి కత్రినా కైఫ్ రీమేక్ చేసి ఆ పాటకు రవీనాకు ఉన్న క్రేజ్ ను మరోసారి గుర్తుచేసింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లోనూ ఆక్టివ్ గా ఉంటోంది. ఓ ఇంటర్వ్యూ లో రవీనా, ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ నుంచి కెరీర్‌ను నాశనం చేసే విషపూరిత గాసిప్ మ్యాగజైన్‌ల వరకు అనేక సమస్యల గురించి మాట్లాడింది.

Raveena-Tandon : నా థైస్ ఇప్పటికి అలానే ఉన్నాయి..

అప్పటి గాసిప్ మ్యాగజైన్‌ల గురించి అడిగినప్పుడు, రవీనా చాలా నిస్సందేహంగా ఇలా చెప్పింది, 90లలో గాసిప్ మ్యాగజైన్‌లు చాలా చెత్తగా ఉండేవి అని వారు స్త్రీలకు అత్యంత శత్రువులు అని పేర్కొంది. బాడీ-షేమ్ చేస్తూ స్త్రీలను క్రిందికి తీసుకురావడానికి సాధ్యమైనదంతా వారు చేస్తారు అని పేర్కొంది. కానీ ఇప్పుడు వారు అతిపెద్ద స్త్రీవాదులుగా తిరుగుతున్నారు అని ,అది తనని అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపింది. రవీనా తన ఫ్యాట్ థైస్ గురించి పరిశ్రమలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి నిర్మొహమాటంగా పంచుకుంది. తాను కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉండేదాన్నని, తన థైస్ క్లియర్ గా కనిపించేవని, వాటిని చూసి ఇండస్ట్రీ లో నాకు పేరు పెట్టారని ఆమె తెలిపింది.

నా థైస్ ఇప్పటికి అలానే ఉన్నాయని దానివల్ల నేనేమి బాధపడేదానిని కాదని, కానీ వాటిని బేస్ చేసుకుని వచ్చే కథనాలు బాధించేవాని తన ఆవేదనని పంచుకుంది. నేనే కాదు ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు ఈ ప్రాబ్లమ్ ను ఎదుర్కొన్నారంది . ఆడవారికి మద్దతు ఇవ్వడానికి బదులుగా, అప్పటి మహిళా సంపాదకులందరూ హీరోలతో ప్రేమలో పడిపోయేవారని , హీరోలు చెప్పేది వినేవారని చెప్పింది. రవీనా చివరిసారిగా కేజీఎఫ్ చాప్టర్ 2లో కనిపించింది. ఆమె త్వరలో రిలీజ్ కానున్న సంజయ్ దత్‌ ఘుడచాడిని ప్రాజెక్ట్‌లలో చేసింది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్, అరణ్యక్ రెండవ సీజన్‌తో తిరిగి రానుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.