Knee Pain: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు.ఇలా చిన్న వయసులోనే చాలామంది మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడటం వల్ల చిన్న పని చేసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కారణంగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నో మందులు వాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. అయితే మందులు వాడిన మోకాళ్ళ నొప్పులు తగ్గని వారు ఈ చిన్న చిట్కాలను కనుక పాటిస్తే తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం తులసితో తయారు చేసిన టీ తాగటం వల్ల ఈ మోకాళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు.అదేవిధంగా ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు ఆవు పాలలోకి చిటికెడు పసుపు వేసి మరిగించి గోరువెచ్చని పాలను తాగటం వల్ల ఎముకలలో సాంద్రత పెరిగి ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇక మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొందడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనెను వేసి కొబ్బరి నూనెను చిన్న మంటపై మరిగించాలి. ఇలా నూనె మరుగుతున్న సమయంలో అదే కప్పుతో ఒక కప్పు అల్లం తురుము వేసి ఈ రెండింటిని బాగా వేడి చేసి వడపోసుకోవాలి.ఇలా వడపోసుకున్నటువంటి ఈ నూనెను ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ప్రతిరోజు మోకాళ్లపై రెండు చుక్కల ఆయిల్ వేసి మర్దన చేయడం వల్ల ఈ నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.ఇలా ఈ చిట్కాలను పాటిస్తూ ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూరలు కూరగాయలు చేపలు, గుడ్లు వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.