Categories: EntertainmentLatest

Kiran Roa : సందీప్ వంగకి అమీర్ ఖాన్ మాజీ భార్య స్ట్రాంగ్ కౌంటర్?

Kiran Roa : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు గురించి చాలా మందికి తెలుసు. స్టార్ హీరో భార్యగానే కాదు మంచి డైరెక్టర్ గా ఆమె ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. కిరణ్ రావు దర్శకత్వంలో గతంలో ధోబీ ఘాట్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడ్యూజ్ చేశారు. అయితే దశాబ్ద కాలం తర్వాత ఈ జోడీ లేటెస్టుగా మిస్సింగ్ లేడీస్ అనే సినిమా తీసింది. అయితే ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. కానీ, OTTలో రిలీజైన తర్వాత, ఈ మూవీపై ప్రశంసలు ఆగడంలేదు. ఈ సినిమాతో ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కిరణ్‌రావుకు అభిమానులు అయిపోయారు. ఈ క్రమంలో మూవీలోని ఓ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీన్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసినట్లు పలువులు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి కిరణ్‌రావు, సందీప్‌రెడ్డి వంగాలకు ఇంటర్నెట్ లో కొంత కాలంగా వాగ్వాదం జరుగుతోంది. కిరణ్ రావు సందీప్ రెడ్డి మూవీస్ పై సంచలన కామెంట్లు చేశారు. సందీప్ వంగా కూడా కామ్ గా ఉండలేదు. అయితే, ఆ వివాదం ఆ తర్వాత సైలెంట్ అయ్యింది అనుకోండి. కానీ ఓటీటీలోకి మిస్సింగ్ లేడీస్ రావడంతో నెటిజన్లు మళ్లీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

kiran-roa-strong-counter-to-animal-director-sandeep-vangakiran-roa-strong-counter-to-animal-director-sandeep-vanga
kiran-roa-strong-counter-to-animal-director-sandeep-vanga

కిరణ్ రావు సినిమాలో ఫూల్ కుమారి ,మంజు బాయి మధ్య ఓ సీన్ ఉంటుంది. మంజు తన పెళ్లి గురించి ఫూల్ కుమారితో సంభాషిస్తుంటుంది. తన భర్త తనను కొడుతున్నాడని, చెప్పింది. అప్పుడు మంజు, నిన్ను లవ్ చేసే వ్యక్తికి నిన్ను కొట్టే హక్కు కూడా ఉంది అని అంటుంది. ఒకరోజు నేను కూడా నా హక్కులను బయట పెట్టాను అని అంటుంది ఫూల్ కుమారీ. ఈ సీన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సీన్ ని నెటిజన్లు సందీప్ రెడ్డి వంగాపై వ్యంగ్యంగా పరిగణిస్తున్నారు.

kiran-roa-strong-counter-to-animal-director-sandeep-vanga

నిజానికి సందీప్ కబీర్ సింగ్ మూవీలో ఓ సన్నివేషం ఉంది. అందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీని కొడతాడు. ఈ సీన్ పై అప్పట్లో బీ టౌన్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిపై సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. “మీరు మీ స్త్రీని తాకలేకపోతే, మీరు ఆమెను చెంపదెబ్బ కొట్టలేరు, ముద్దు కూడా పెట్టుకోలేరు అని అన్నాడు. ఆ డైలాగ్స్ కి కిరణ్ రావు తన సినిమా మిస్సింగ్ లేడీస్లో ఓ సీన్ తో గట్టి కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago