Categories: EntertainmentLatest

Aditi Rao : మాది వనపర్తి సంస్థానం..అందుకే అక్కడ ఎంగేజ్మెంట్

Aditi Rao : కోలీవుడ్ హీరోయిన అదితి రావ్ హైదరీ, నటుడు సిద్దార్థ్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి స్నేహితులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ ఒక్క అనౌన్స్‎మెంట్‎తో వారి రిలేషన్ గురించి వస్తున్న పుకార్లకు అధికారికంగా చెక్ పెట్టారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ వనపర్తిలోని 400 ఏళ్ల నాటి పురాతన ఆలయంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు అక్కడే వేడుక ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తాజాగా అదితి తెలిపింది. తను నటించిన హీరామండి వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో అదితి తన ఎంగెజ్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

aditi-rao-opens-about-engagement-with-hero-siddarth

గత నెలలో అదితి, సిద్దార్థ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న అత్యంత పురాతన శ్రీరంగపురం ఆలయంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుక జరిగే వరకు ఎవరికీ ఈ విషయం తెలియదు. ఇద్దరూ చాలా సీక్రెట్ గా తమ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నటి అదితి రావ్ హైదరీ వనపర్తి సంస్థానాధీశుల వారసురాలు. అందుకే ఆ గుడి పురోహితులు దగ్గరుండి మరీ ఈ వేడుకను సంప్రదాయ పద్ధతుల్లో జరిపించారు. నిశ్చితార్థం తర్వాత అదితి రావు రింగ్స్ తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అధికారికంగా తమకు ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిపింది. కానీ ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు.

aditi-rao-opens-about-engagement-with-hero-siddarth

రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నా తల్లి కోరిక మేరకే నేను నిశ్చితార్థం చేసుకున్నాను. నా ఎంగేజ్‌మెంట్ తర్వాత అమ్మకు చాలా కాల్ వచ్చాయి. నిజంగానే అదితి పెళ్లి చేసుకుందా అని అందరూ అమ్మ అడిగేవారు. అమ్మ ఆ కాల్స్ బాధ చూడలేక ఎంగేజ్మెంట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వమని చెప్పింది. దీంతో నేను, సిద్ధార్థ్‌ ఈ విషయంపై పోస్ట్‌లు పెట్టాం. నా నిశ్చితార్థం 400 ఏళ్ల నాటి గుడిలో జరిగింది. ఆ గుడితో మా ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది . అందుకే అక్కడ చేసుకున్నాను.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.