Kiran Roa : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు గురించి చాలా మందికి తెలుసు. స్టార్ హీరో భార్యగానే కాదు మంచి డైరెక్టర్ గా ఆమె ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. కిరణ్ రావు దర్శకత్వంలో గతంలో ధోబీ ఘాట్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడ్యూజ్ చేశారు. అయితే దశాబ్ద కాలం తర్వాత ఈ జోడీ లేటెస్టుగా మిస్సింగ్ లేడీస్ అనే సినిమా తీసింది. అయితే ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. కానీ, OTTలో రిలీజైన తర్వాత, ఈ మూవీపై ప్రశంసలు ఆగడంలేదు. ఈ సినిమాతో ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కిరణ్‌రావుకు అభిమానులు అయిపోయారు. ఈ క్రమంలో మూవీలోని ఓ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీన్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసినట్లు పలువులు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి కిరణ్‌రావు, సందీప్‌రెడ్డి వంగాలకు ఇంటర్నెట్ లో కొంత కాలంగా వాగ్వాదం జరుగుతోంది. కిరణ్ రావు సందీప్ రెడ్డి మూవీస్ పై సంచలన కామెంట్లు చేశారు. సందీప్ వంగా కూడా కామ్ గా ఉండలేదు. అయితే, ఆ వివాదం ఆ తర్వాత సైలెంట్ అయ్యింది అనుకోండి. కానీ ఓటీటీలోకి మిస్సింగ్ లేడీస్ రావడంతో నెటిజన్లు మళ్లీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.
కిరణ్ రావు సినిమాలో ఫూల్ కుమారి ,మంజు బాయి మధ్య ఓ సీన్ ఉంటుంది. మంజు తన పెళ్లి గురించి ఫూల్ కుమారితో సంభాషిస్తుంటుంది. తన భర్త తనను కొడుతున్నాడని, చెప్పింది. అప్పుడు మంజు, నిన్ను లవ్ చేసే వ్యక్తికి నిన్ను కొట్టే హక్కు కూడా ఉంది అని అంటుంది. ఒకరోజు నేను కూడా నా హక్కులను బయట పెట్టాను అని అంటుంది ఫూల్ కుమారీ. ఈ సీన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సీన్ ని నెటిజన్లు సందీప్ రెడ్డి వంగాపై వ్యంగ్యంగా పరిగణిస్తున్నారు.
నిజానికి సందీప్ కబీర్ సింగ్ మూవీలో ఓ సన్నివేషం ఉంది. అందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీని కొడతాడు. ఈ సీన్ పై అప్పట్లో బీ టౌన్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిపై సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. “మీరు మీ స్త్రీని తాకలేకపోతే, మీరు ఆమెను చెంపదెబ్బ కొట్టలేరు, ముద్దు కూడా పెట్టుకోలేరు అని అన్నాడు. ఆ డైలాగ్స్ కి కిరణ్ రావు తన సినిమా మిస్సింగ్ లేడీస్లో ఓ సీన్ తో గట్టి కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.