Kiara Advani – sidharth Malhotra : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. సహ నటుడు సిద్దార్థ్ మల్‌హోత్రాను ఈ బ్యూటీ పెళ్ళి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసందే. గత కొంతకాలంగా ప్రేమ పక్షుల్లా తిరుగుతున్న కియారా, సిద్దార్థ్ పెళ్లి పీటల వరకూ వెళ్ళరని అందరూ కామెంట్స్ చేశారు. కానీ, అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. హిందీలో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌తో బాగా పాపులర్ అయిన కియారా, ఆ తర్వాత కబీర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది.
ఈ సినిమా తర్వాత హిందీ సీమలో వరుసగా సినిమాలు చేస్తూ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్‌కి జోడీగా కియారా చేసిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి. తెలుగులోనూ అమ్మడు హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా, ఆ సినిమాతో భారీ హిట్ అందుకుంది.
Kiara Advani – sidharth Malhotra : కియారా అద్వానీ RC 15 కంప్లీట్ చేస్తుందా..?
కానీ, రెండవ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో మళ్ళీ తెలుగులో నటించలేదు. చెప్పాలంటే హిందీలో విపరీతమైన బిజీగా ఉండటమే దీనికి కారణం. ఇక శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా RC 15 తో మళ్ళీ తెలుగు తెరమీద కనిపించబోతోంది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది.
ఇప్పుడేమో అమ్మడు పెళ్లి చేసుకోబోతోంది. దాంతో కియారా అద్వానీ RC 15 కంప్లీట్ చేస్తుందా..? అనే సందేహాలు చాలామందిలో మొదలయ్యాయి. కానీ, చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకి ఇప్పటి వరకూ కమిటైన సినిమాలను పూర్తి చేస్తుందట. ఫ్యూచర్‌లో కూడా హీరోయిన్‌గా కొనసాగనుందని బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న లేటెస్ట్ న్యూస్. కాబట్టి ఆర్సీ 15 విషయంలో కియారా గురించి వస్తున్నవన్నీ రూమర్లే అనుకోవచ్చు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.