Karthika Masam: హిందువులకు ప్రతి ఒక్క మాసం కూడా ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ క్రమంలోనే తెలుగు మాసాలలో వచ్చే కార్తీకమాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కార్తీకమాసం శివకేశవలకు ఎంతో ప్రీతికరమైన మాసం. మరి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ మాసంలో మనం ఎన్నో రకాల నియమనిష్ఠలను పాటించడం వల్ల శివ కేశవుల అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. మరి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి తినాల్సిన తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
కార్తీకమాసం శ్రీమహావిష్ణుమూర్తికి ఎంత ప్రీతికరమైనది కనుక ఈ మాసంలో ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టుకు దీపారాధన చేయటం వల్ల ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతారు. ఇక ఈ మాసంలో చాలా నియమనిష్టలతో ఉండాలి. ప్రతిరోజు ఉదయం, సంధ్య సమయంలో దీపాలు వెలిగించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, దుష్ట శక్తుల ప్రభావం మనపై ఉండదు.
ఇక కార్తీకమాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు ఇలా ఉపవాసం ఉండి దానధర్మాలు చేయడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఈ జన్మలో భక్తులు నేలపై శయనించి, బ్రహ్మచర్యాన్ని ఆచరించి, దీపదానం చేయడం, తులసి చెట్టును పూజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పురాణాల పేర్కొన్నాయి. కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, బెండకాయ, పొట్లకాయ, కాకర కాయను అస్సలు తినకూడదు. అలాగే, ఈ పవిత్ర మాసంలో ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లను తినవద్దు. అంతే కాదు ఈ మాసంలో బెల్లం తినడం ఎంతో మంచిది. ఇక కార్తీకమాసంలో పొరపాటున కూడా మాంసాహార పదార్థాలను ముట్టుకోకూడదు. ఇక ఈ మాసంలో మన స్తోమతకు తగ్గట్టుగా పేదలకు దానధర్మాలు చేయడం వల్ల మోక్షం కలుగుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.