BJP: కర్ణాటకలో ఎన్నికల వేడి నడుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యకర్నాటక ఎన్నికలలో పోరు గట్టిగా నడుస్తోంది.అధికార పార్టీ బీజేపీ సారి భారీ మెజార్టీతో కర్ణాటక పీఠాన్ని అధిష్టించాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి సిద్ధం అవుతోంది. మధ్యలో కుమారస్వామి జేడీఎస్ కూడా బలమైన స్థానాలలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాజకీయ సర్వేల బట్టి మరల జేడీఎస్ కర్ణాటకలో ఎవరు అధికారంలోకి రావాలనేది డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉంటుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికలు బీజేపీకి మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి. మరో ఆరు నెలలు లేదా ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.
తరువాత ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి కర్ణాటక ఎన్నికలలో గెలుపు కూడా కొంత సానుకూలించే అంశం అని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ ఆనుకొని కొన్ని జిల్లాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో బీజేపీ ప్రభావం పెరగాలంటే కచ్చితంగా కన్నడనాట గెలుపు తప్పనిసరి. తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా అగ్రెసివ్ మోడ్ లో వెళ్తోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ని నిలువరించడానికి బలమైన వ్యూహాలు వేసుకుంటూ బండి సంజయ్ టీమ్ దూసుకుపోతోంది. దీనికి తగ్గట్లుగానే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు కూడా ఉండటం విశేషం.
కొన్ని అంశాలు బీజేపీకి సానుకూలంగా మారితే మరికొన్ని బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణలో ఎన్నికలు ఈ సారి గట్టిగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికల ప్రభావం కొంతలో కొంత అయిన ఏపీలో కనిపించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీపై ఏపీలో అంత సానుకూలత లేదు. అందుకే జనసేనాని కూడా వారి నుంచి దూరంగా వచ్చేసి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ నిర్ణయాలు కూడా మార్చుకొని ఏపీలో ఎన్నికలకి వెళ్ళే ఛాన్స్ ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.