Kareena Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి అందరికీ తెలుసు. కపూర్ ఫ్యామిలీకి చెంది ఈ బ్యూటీ కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైనా ఆమె ఫిజిక్ ఇప్పటికీ వావ్ అనిపిస్తుంది. అందుకే ఇప్పటికీ ఆమె యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. బాలీవుడ్ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈ అమ్మడికి క్రేజ్ కూడా అదే లెవెల్ లో ఉంటుంది. సినీ ఫీల్డ్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ కరీనాకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈ మధ్య సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాను తెగ వాడేస్తుండటంతో కరీనా కూడా యాక్టివ్ అయ్యింది. అప్పుడప్పుడు తన ఫోటోలను, వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఓ బుక్ రాసింది. దానికి కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ అని పేరు పెట్టింది. అయితే ఈ బుక్ పై ప్రస్తుతం వివాదం మొదలంటే. ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలంటూ కరీనాకు లేటెస్టుగా హైకోర్టు నోటీసులు పంపించింది.
కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మాన్యువల్ ఫర్ మామ్స్-టు-బీ అనే పుస్తకం ఆగస్టు 2021లో విడుదలైంది. తన ప్రెగ్నెన్సీ జర్నీని ఈ బుక్ లో తెలిపింది. ఇక కరీనా రాసిని బుక్ పైన బైబిల్ అనే వర్డ్ ఉండటంతో దానిని వ్యతిరేకిస్తూ లాయర్ క్ట్రిస్టోఫర్ ఆంథోనీ కోర్టును ఆశ్రయించారు. ఈ బుక్‌పై ‘బైబిల్’ అనే పదం వాడటం వల్ల క్రైస్తవుల మనోభవాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆయన పిటీషన్‌లో తెలిపారు. క్రిస్టియన్స్ అతి పవిత్రమైన గ్రంథం బైబిల్. అలాంటి బైబిల్ ను కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీతో పోల్చడం తప్పని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో మధ్యప్రదేశ్ హై కోర్ట్ కరీనాకు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా కరీనాపై కేసు ఫైల్ చేయాలని క్రిస్టోఫర్ ఆంథోనీ తెలిపారు. దానితో పాటే ఆమె రాసిన బుక్‌ను బ్యాన్ చెయ్యాలని కోరారు. దీంతో ఈ కేసు జులై ఒకటికి వాయిదా పడింది. మరి ఈ వివాదం ఎంతో దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.