Kantara 2 : కేజీఎఫ్ తర్వాత ఆ లెవెల్ లో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన కన్నడ మూవీ ఏదైనా ఉందంటే అది ‘కాంతార’ మాత్రమే. రిషబ్ శెట్టి హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మూవీ కన్నడలో సెన్సేషనల్ హిట్ సాధించింది. సినిమాకు మంచి టాక్ రావడంతో ఇతర భాషల్లో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఆదరగొట్టేసింది ఈ మూవీ. అన్ని ఇండస్ట్రీస్ లోని బాక్సాఫీసుల్లో అత్యద్భుతమైన రెస్పాన్స్ అందుకొని కలెక్షన్ ల వర్షం కురిపించింది కాంతారా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అందరూ దీని గురించే చాలా రోజులు మాట్లాడుకున్నారు. అంతలా ఇండియను షేక్ చేసింది ఈ చిత్రం.
కాంతారా మూవీ కి వచ్చిన ఆధరణను చూసి ఆ రేంజ్ లో అంతకు మించి ‘కాంతారా 2’ ఉండేలా రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నారు. కాంతారా ప్రీక్వెల్ గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్ . అందుకు అనుగుణంగానే భారీ బడ్జెట్ ను ఈ మూవీకి కేటాయించారు. ఈమధ్యనే విడుదలైన కాంతార 2 ఫస్ట్ లుక్ టీజర్ చిత్రం పై భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం కాంతారా2 షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కోసం మూవీ టీం ఆడిషన్స్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఓపెన్ గా పూర్తి వివరాలను తెలిపారు.
30 – 60 ఏళ్లు ఉన్న మగవారు, 18 – 60 ఏళ్ల వయసున్న ఆడవాళ్లు ఈ ఆడిషన్స్ కి రావచ్చని ప్రకటించారు. నటన మీద ఆసక్తి ఉన్నవారు Kantara. film అనే వెబ్ సైట్ లో ప్రొఫైల్స్ ని అప్లోడ్ చేయాలని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఆడిషన్ కాల్ గురించి తెలుసుకున్న మంగళవారం సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆడిషన్ కోసం ఓపెన్ గా నన్ను ట్రై చేయండి అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో ట్వీట్ చేసింది.
” కాంతారా సినిమాలో భాగం అయ్యేందుకు నేను ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. ప్లీజ్ నన్ను కొంచం దృష్టిలో పెట్టుకోండి. నా తరఫున మీకు ఈ మెసేజ్ పంపిస్తున్నాను. నేను రీసెంట్ గా నటించిన మంగళవారం మూవీలో నా యాక్టింగ్ కి ప్రశంసలు కూడా వచ్చాయి.మీరు ఈ మూవీ చూస్తే ఆనందిస్తాను. దయచేసి మీ ప్రాజెక్టు ఆడిషన్స్ గురించి సలహా ఇవ్వండి. నా పేరును మళ్ళీ పోస్ట్ చేసినందుకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు థాంక్యూ ” అంటూఅంటూ పాయల్ రాజ్ పుత్ కాంతారా టీంకి రిప్లై ఇచ్చింది. మంగళవారం మూవీ చూసైనా రిషబ్ కాంతారాలో పాయల్ కి అవకాశం ఇస్తాడో లేదో చూడాల్సిందే.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.