Vijay Devarakonda : అట్లుంటది విజయ్ దేవరకొండ తోటి..ఆ వార్తలు రాసిన వ్యక్తి అరెస్ట్

Vijay Devarakonda : టాలీవుడ్ లో రౌడీ బాయ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పాల్సిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కి చేరుకున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి సినిమా పెళ్లిచూపులు హిట్ సాధించినప్పటికీ అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే విజయ్ కి స్టార్డమ్ స్టేటస్ మాత్రం అంత ఈజీగా రాలేదు .

vijay-devarakonda-cyber-crime-police-arrested-youtuber-for-spreading-fake-news

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాడు. ఎన్నో ఒడిదుడుకులను చూశాడు. అందుకే ఇప్పుడు స్ట్రాంగ్ గా స్టార్ హీరోగా నిలబడ్డాడు. ఈ సంవత్సరం ఖుషి సినిమాతో ఆడియన్స్ కి హాయ్ చెప్పాడు విజయ్ దేవరకొండ. లైగర్ ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తో నటించిన ఈ మూవీ మళ్లీ విజయ్ లో కొత్త ఊపు తీసుకొచ్చింది. ప్రస్తుతం విజ్జు పరశురామ్ తో “ఫ్యామిలీ స్టార్” అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హాయ్ నాన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించునుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

vijay-devarakonda-cyber-crime-police-arrested-youtuber-for-spreading-fake-news

ఇదిలా ఉండగా గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేసి కొంత మంది ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ చేస్తున్నారు. విజయ్ కి పొగరాని, ఆటిట్యూడ్ ఉందని, ఇండస్ట్రీ లోని పెద్దలకు అసలు మర్యాద ఇవ్వడని, ఇక హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయనికి ఇలా ఎన్నో రకాల రూమర్స్ వ్యాపిస్తున్నారు. అయితే ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చే ఓ యూట్యూబర్ కి సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా చుక్కలు చూపించారు.

vijay-devarakonda-cyber-crime-police-arrested-youtuber-for-spreading-fake-news

విజయ్ పై అభ్యంతరకర వార్తలు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ‘సినీ పోలీస్’ అనే యూట్యూబ్ ఛానల్ లో విజయ్ ను అవమానిస్తూ ఓ వార్తను ప్రసారం చేశారు. ఆ న్యూస్ ను పోస్ట్ చేసిన వ్యక్తి వెంకట కిరణ్ అనంతపురంకు చెందిన వాడుగా గుర్తించారు. విజయ్ దేవరకొండ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఉన్న వీడియోలను చూసిన విజయ్ మూవీ మేకర్స్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వెంకట్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన వెంకట్ కి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలన్నింటిని డిలీట్ చేయించారు పోలీసులు. ముందు ముందు ఇలాంటి వీడియోలు పెట్టకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే కాదు ఇంతకు ముందు సమంత, శ్రీ లీల పై కొంతమంది ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం హీరో రామ్ చరణ్ ఫ్యామిలీ ని కూడా పర్సనల్ గా టార్గెట్ చేసి వీడియోలు చేశాడు.

Sri Aruna Sri

Recent Posts

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

7 hours ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

1 day ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

1 day ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

2 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

2 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

3 days ago

This website uses cookies.