Kannappa: మంచు విష్ణు కి తీవ్రంగా గాయాలైనట్టు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలోనూ ఇలాగే షూటింగ్ సమయంలో విష్ణు గాయాలపాలైన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడేమైంది..అసలు ఎందుకు గాయాలైయ్యాయో వార్తా సారాంశంలో చూద్దాం. ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ అనే టైటిలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ సర్కిల్స్ లో అందిన సమాచారం మేరకు ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ న్యూజిలాండ్ లో జరుగుతోందట.
‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా నయనతార నటిస్తున్నారట. పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నాఉ. అయితే, షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాద వశాత్తు డ్రోన్ కెమెరా వచ్చి విష్ణు మీద పడినట్టుగా సమాచారం. వెంటనే యూనిట్ సభ్యులు వచ్చి విష్ణుని పక్కకి లాగారట.
కొద్దిపాటి గాయాలైనట్టుగా తెలుస్తోంది. చిత్రీకరణ నిలిపివేసి యూనిట్ సభ్యులు మంచు విష్ణుని ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా సమాచారం. చికిత్స చేసిన డాక్టర్లు ఆయనకి ఏమీ ప్రమాదం లేదని, చిన్నపాటి దెబ్బలే తగిలాయని.. అంతా బాగానే ఉందని చెప్పారట. దాంతో అటు మోహన్ బాబు ఫ్యామిలీ, ఇటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారని నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా మంచు హీరోలకి హిట్ దక్కడం లేదు. అయినా ధైర్యంగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి వెనకాడటం లేదు. చూడాలి మరి కన్నప్ప సినిమాతో అయినా విష్ణు హిట్ అందుకుంటాడేమో.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.