Categories: EntertainmentLatest

Kannappa : శివుడిగా అక్షయ్ కుమార్..తగ్గేదేలే అంటున్న మంచు విష్ణు

Kannappa : మంచు విష్ణు ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న అప్‎డేట్స్ మంచు ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి. తన డ్రామ్ ప్రాజెక్ట్ కోసం విష్ణు ఏం చేయడానికైనా ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదని తెలుస్తోంది. కన్నప్పకోసం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి లెజెండరీ నటలను దింపుతున్నాడు.ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందన్న న్యూస్ టాలీవుడ్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. తాజాగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు అఫీషియల్ గా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. ఓ వీడియోను షేర్ చేసి ప్రేక్షకుల్లో కన్నప్పపై మరిన్ని అంచనాలను పెంచేశాడు.

kannappa-bollywood-star-akshay-kumar-as-god-siva-in-kannappa-moviekannappa-bollywood-star-akshay-kumar-as-god-siva-in-kannappa-movie
kannappa-bollywood-star-akshay-kumar-as-god-siva-in-kannappa-movie

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహ‌న్ బాబు కన్నప్ప మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ మూవీనీ మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్ లో కన్నప్ప థియేటర్స్ లోకి రానుంది. టైటిల్ లీడ్ రోల్ లో మంచు విష్ణు కనిపించనున్నాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార, మధుబాల వంటి స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. లేటెస్టుగా ఈ ప్రాజెక్ట్ లోకి అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ పాన్ ఇండియా మూవీకి బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చినట్లయింది. ఈ సినిమాతో అక్షయ్ తెలుగు ఇండస్ట్రీలోకి మొదటిసారి ఎంట్రీ ఇస్తున్నాడు.

kannappa-bollywood-star-akshay-kumar-as-god-siva-in-kannappa-movie

అక్షయ్ కుమార్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అక్షయ్ తన కెరీర్ లో చాలా తక్కువ ఫెయిల్యూర్స్ ను మాత్రమే చూశారు. తనదైన వైవిధ్యమైన నటనతో, డౌట్ టు ఎర్త్ ఆటిట్యూడ్ తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులో అక్షయ్ సినిమాలు చేయకపోయినా ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే 1993లో అక్షయ్ ఓ కన్నడ మూవీలో కనిపించారు. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన రోబో2.0 సినిమాలో పక్షిరాజుగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక మంచు విష్ణు కన్నప్ప సినిమాలో అక్షయ్ శివుడిగా కనిపించనున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో విడుదలైన ఓ మై గాడ్ 2లో ఇలాంటి పాత్రలోనే అక్షయ్ కనిపించారు. భేష్ అనిపించుకున్నారు. దీంతో కన్నప్పకు బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ ఏర్పడుతుందని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా కనిపించనున్నాడని సమాచారం.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

7 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago